ఆశ పెట్టి.. దోచేసిన కి‘లేడీ’..

Published on Thu, 07/18/2024 - 11:46

సాక్షి, హైదరాబాద్‌: అధిక లాభాల పేరిట ఓ వ్యక్తికి ఆశపెట్టింది ఓ కి‘లేడీ’. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. లాభాల సంగతేమోకానీ అసలు సొమ్ము అయినా తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరించింది. ఎట్టకేలకు సైబరాబాద్‌ ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌(ఈఓడబ్ల్యూ) పోలీసులకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లికి చెందిన పానుగంటి ఇందిరాదేవిరెడ్డి అలియాస్‌ ఇందిరాలా ఇందిరాదేవిరెడ్డి నాగోల్‌లో దేవిఫుడ్స్, బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. 

ఈ క్రమంలో మదీనాగూడకు చెందిన ఎస్‌.సత్యనారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను ప్రవాసరాలినని, తనకు నాగోల్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి ప్రాంతాలలోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాలు ఉన్నాయని నమ్మించింది. నకిలీ యాజమాన్యపత్రాలను కూడా సృష్టించి చూపించింది. ఫుడ్‌ ఇండస్ట్రీ, బ్యూటీ పార్లర్‌లో పెట్టుబడి పెడితే అధికలాభాలు వస్తాయని ఆశపెట్టి సత్యనారాయణ నుంచి రూ.3.06 కోట్లు వసూలు చేసింది. బాధితుడి వద్ద నుంచి రెండు కార్లను తీసుకొని తనఖా పెట్టింది. 

సూడో పోలీసులతో బెదిరింపులు.. 
అయితే ఆమె ఎంతకీ లాభాలు ఇవ్వడంలేదు. దీంతో లాభాలు కాదు కదా అసలు సొమ్ము అయినా వెనక్కి ఇవ్వాలని నిలదీయగా తన ఇద్దరు స్నేహితులు పోలీసు అధికారులని పరిచయం చేసింది. వారితో కలిసి తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి భయబ్రాంతులకు గురిచేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇందిరాదేవిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమె నుంచి రెండు కార్లు, ఐ–ఫోన్‌ స్వా«దీనం చేసుకున్నారు. ఈమె గతంలో మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడింది. ఈ కేసులో బాధితుడి నుంచి రూ.కోటి వసూలు చేసింది.  

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)