అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
Breaking News
జలమండలి సేవల్లో మరో డిజిటల్ అడుగు..
Published on Thu, 07/30/2026 - 12:22
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో నీటి సరఫరా వ్యవస్థలో పారదర్శకమైన బిల్లింగ్ విధానం అమలుకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జలమండలి వాణిజ్య, బల్క్ కనెక్షన్లకు అత్యాధునిక ’ఆటోమేటిక్ రీడింగ్’ మీటర్లను అమర్చే రూ.31.70 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రాజెక్టుకు ముందస్తు అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు.
2,984 కనెక్షన్లకు ప్రాధాన్యం..
తొలిదశలో మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లోని సుమారు 2,984 కనెక్షన్లకు ఐదేళ్ల నిర్వహణ కాల పరిమితితో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్’ మీటర్లను అమలు చేయనున్నారు. తొలి విడతలో వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్ల పరిధిలో కొత్త మీటర్లు అమర్చాలని జలమండలి నిర్ణయించింది.
అత్యాధునిక అ్రల్టాసోనిక్, జీఎస్ఎం సాంకేతికత
కొత్తగా ఏర్పాటు చేసే ఏఎంఆర్ మీటర్లు అ్రల్టాసోనిక్ (ట్రాన్సిట్ టైమ్) సాంకేతికతతో పాటు జీఎస్ఎం కమ్యూనికేషన్ మాడ్యూల్స్‌తో పని చేస్తాయి. దీని ద్వారా సిబ్బంది నేరుగా వెళ్లి రీడింగ్ తీయాల్సిన అవసరం లేకుండా, రీడింగ్ వివరాలు సెంట్రల్ సర్వర్‌కు ఎప్పటికప్పుడు చేరుతాయి.
Tags : 1