Breaking News

అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల కూడా..

Published on Thu, 07/03/2025 - 19:36

సాక్షి, హైద‌రాబాద్‌: రాష్ట్ర రాజధాని మణిహారంగా ఉన్న జలమండలి ఇక మహా జలమండలిగా మారనుంది. తాగునీటి, సీవరేజీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపలి ప్రాంతాలకు నెట్‌వర్క్‌ ఉండగా, వెలుపల కూడా విస్తరించే చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో నాలుగు దిక్కులా విస్తరిస్తున్న నగర భవిష్యత్తు, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టి పెట్టుకొని సీవరేజీ, వాటర్‌ ప్రాజెక్టు సమగ్ర నివేదిక రూపకల్పనకు ఆదేశించారు.  

2050 చదరపు కిలోమీటర్లు 
జలమండలి నెట్‌వర్క్‌ 1,450 చదరపు కిలోమీటర్ల వరకు ఉండగా.. 2,050 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కోర్‌ సిటీలో 169.3 చ. కి.మీటర్లు, చుట్టుపక్కల 518.9 చ.కి.మీటర్లు, ఓఆర్‌ఆర్‌ పరిధిలో 762 చ.కి.మీటర్లు విస్తరించి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరో 600 చ.కి.మీటర్ల నెట్‌వర్క్‌ కోసం కసరత్తు చేస్తోంది. మహా విస్తరణ మాస్టర్‌ ప్లాన్‌ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) రూపొందించి మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది. వాటర్, సీవరేజ్‌ పైప్‌లైన్లతోపాటు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టి శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగం కోసం కూడా దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేయాలని యోచిస్తోంది.

జలమండలి పరిధిలోకి...  
శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, పెద్దఅంబర్‌పేట, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తెల్లాపూర్, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలు ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఉన్నాయి. దీంతో వాటిని కూడా జలమండలి (Jalamandali) పరిధిలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

చ‌ద‌వండి: అక్క‌డ అలా.. ఇక్క‌డ ఇలా..!  

ఓఆర్‌ఆర్‌ పరిధిలో.. 
ఇప్పటికే ఓటర్‌ రింగ్‌రోడ్‌ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల తాగునీటి సరఫరా కోసం ఓఆర్‌ఆర్‌ తాగునీటి ప్రాజెక్టు–1, 2 దశలను పూర్తి చేసి సేవలందిస్తోంది. ఓఆర్‌ఆర్‌–1 కింద జీహెచ్‌ఎంసీ పరిధి అవతల ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 190 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేందుకు సుమారు రూ.124 కోట్ల అంచనా వ్యయంతో 70 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం గల 164 రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు దాదాపు రూ.527 కోట్ల వ్యయంతో 1,601 కిలో మీటర్ల మేర పైపులైన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసింది. ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు–2 కింద సుమారు 189 కోట్ల అంచనా వ్యయంతో 140 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం కలిగిన 71 సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణం, సుమారు రూ.778 కోట్ల అంచనా వ్యయంతో 2,758 కిలోమీటర్ల మేర కొత్త పైపులైను నెట్‌వర్క్‌ పూర్తి చేసి సేవలు అందిస్తోంది. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)