Breaking News

HYD: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి

Published on Mon, 08/18/2025 - 07:02

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి నెలకొంది. ఊరేగింపు రథానికి కరెంట్‌ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పండుగ వేడుకల్లో ఇలా జరగడంతో స్థానికులు కన్నీటపర్యంతమవుతున్నారు.

వివరాల ప్రకారం.. రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రథాన్ని ఊరేగించారు. రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించడంతో దాన్ని పక్కన నిలిపివేసిన స్థానిక యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్‌ బలంగా కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ ఘటనతో అక్కడంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది.

ఈ ఘటనతో వెంటనే తేరుకున్న స్థానికులు.. గాయపడిన తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్‌ (21), సురేశ్‌ యాదవ్‌(34), శ్రీకాంత్‌రెడ్డి(35), రుద్రవికాస్‌(39), రాజేంద్రరెడ్డి(45) ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్‌ శ్రీనివాస్‌ సైతం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)