Breaking News

Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..

Published on Mon, 04/07/2025 - 10:58

హైదరాబాద్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై విచక్షణా రహితంగా సిమెంట్‌ బ్రిక్‌తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లికి చెందిన మహ్మత్‌ బస్రత్‌(32) కోల్‌కత్తాకు చెందిన షబానా పర్వీన్‌(22)ను 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. 

హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. బస్రత్‌ తల్లిదండ్రులతో పర్వీన్‌ తరచు గొడవ పడుతుండటంతో రెండు నెలల క్రితం వేరు కాపురం పెట్టాడు. కాగా పర్వీన్‌కు వాంతులవుతుండడంతో రాఘవేంద్ర కాలనీలోని సియాలైఫ్‌ హాస్పిటల్‌లో చేర్పించాడు. ఏప్రిల్‌1న రాత్రి 10 గంటలకు డిశ్చార్జి చేయగా బయటకు వచ్చి ఇద్దరు గొడవపడ్డాడు. 

కోపంతో బస్రత్‌ తన్నడంతో షబానా పర్వీన్‌ కిందపడి పోయింది. అక్కడ ఉన్న రెండు సిమెంట్‌ బ్రిక్‌లతో దాదాపు 15 సార్లు తల, శరీరంపై మోదాడు. చనిపోయిందనుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని నిమ్స్‌ ఆస్పత్రికి  తరలించగా అక్కడి చికిత్సపొందుతోంది. వైద్యులు నిర్వహించిన పరీక్షలలో మూడు నెలల గర్భిణి అని తేలిందని, షబానా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)