Breaking News

అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు

Published on Mon, 07/27/2026 - 13:42

హైదరాబాద్‌: నిత్యం తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.. వారి కూతుళ్లు విసిగి వేసారిపోయారు.. సొంతూరికి వెళ్లి ఏదైనా పని చేసుకుని బతుకుదామని భావించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైలెక్కారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఆదివారం గాందీనగర్‌ ఏసీపీ కార్యాలయంలో సికింద్రాబాద్‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్‌ డీసీపీ నరసయ్య, ఏసీపీ యాదగిరి, దోమలగూడ సీఐ అంజద్‌ అలీతో కలిసి వివరాలు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తోటరాం, రాంధులారి దంపతులు 2 నెలల క్రితం నగరానికి వలస వచ్చి దోమలగూడ ఫరీద్‌ బస్తీలో నివసిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నారు. ఆ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటంతో భరించలేక వారి కుమార్తెలు సహిత కుమారి(17), స్నేహ కుమారి(16)తోపాటు సమీప బంధువైన లత(15) గత ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఇంట్లోంచి పారిపోయారు. పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాదాపు 262 సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు.

రైలెక్కి.. ఛత్తీస్‌గఢ్‌ చేరి..
హిమాయత్‌నగర్‌ మెయిన్‌ రోడ్‌లో ఆటో ఎక్కిన బాలికలు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు, అక్కడ నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఘన్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో నాగ్‌పూర్‌ చేరుకోగా ఓ వ్యక్తి చేరదీసి ఫాంహౌస్‌లో పనులు చేసేందుకు గడ్చిరోలి మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని పతంజూరుకు చెందిన బిశ్వజిత్‌ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు గుర్తించిన బిశ్వజిత్‌ దోమలగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకర్‌ పోలీసుల సహకారంతో బాలికలను తీసుకొచ్చి సఖీ సెంటర్‌కు అప్పగించారు. తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో పిల్లల్ని పెంచాలని డీసీపీ సూచించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)