Breaking News

హైదరాబాద్‌ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వండి

Published on Wed, 07/23/2025 - 10:36

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి వాతావరణ శాఖ మరోసారి భారీ నుంచి అతిభారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రోడ్ల మీద నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 

మంగళవారం రాత్రి నుంచే జంట నగరాల్లోని చాలాచోట్ల చిరు జల్లుల నుంచి ఓ  మోస్తరు వాన కురుస్తోంది. మధ్యాహ్నాం లేదంటే సాయంత్రానికి ఇది భారీ నుంచి అతి భారీ వర్షంగా మారొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో మూడు నాలుగు రోజులపాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఈ తరుణంలో.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం ఇవ్వమని కంపెనీలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇప్పటికే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన సైబరాబాద్‌ పోలీసులు.. ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌ హోం అంశాన్ని పరిశీలించాలని కోరారు. అదే సమయంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ఆఫీసులకు వచ్చిపోయేవాళ్లు తమ ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని సూచిస్తున్నారు. ఇంకోవైపు.. కరెంట్‌ పోల్స్‌, మ్యాన్‌హోల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచిస్తున్నారు. 

ఇంకోవైపు.. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్‌ సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ప్రస్తుత నీటి మట్టం 513.34 మీటర్లతో ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌కు చేరింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)