Breaking News

బంగ్లా యువతిని నిర్బంధించి.. వ్యభిచార కూపంలోకి దించి

Published on Sun, 08/10/2025 - 10:06

హైదరాబాద్‌: విదేశీ యువతిని నిర్బంధించి వ్యభిచార కూపంలోకి దించిన ముఠా సభ్యులను పాతబస్తీ బండ్లగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్, బండ్లగూడ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.దేవేందర్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. బంగ్లాదేశ్‌ ఢాకా కు చెందిన రూపా అనే మహిళ సమీపంలో ఉండే యువతిని  హైదరాబాద్‌ నగరం నివాసం, జీవనోపాధికి బాగుంటుందని నమ్మించి ఆరు నెలల క్రితం అక్రమంగా పశి్చమ బెంగాల్‌ మీదుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. 

ఇక్కడికి వచ్చాక మెహదీపట్నం మురాద్‌నగర్‌కు చెందిన షహనాజ్‌ ఫాతీమా(32) ఇంట్లో ఉంచింది. అనంతరం హఫీజ్‌బాబానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ సమీర్‌(23) బాధితురాలిని బండ్లగూడ ఇస్మాయిల్‌ నగర్‌కు చెందిన హజేరా బేగం (41) ఇంటికి తీసుకొచ్చి నిర్బంధించారు. ‘నీవు వ్యభిచారం చేయాలని, లేకుంటే భారత్‌కు అక్రమంగా వచ్చావంటూ ఫిర్యాదు చేస్తే జైలుకు వెళుతావంటూ’ తీవ్రంగా బెదిరించడంతో బాధితురాలు గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించింది.

 ఇలా ఆరు నెలల నుంచి నగరంలోని పలు హోటళ్లకు బాధితురాలిని పంపించి వ్యభిచారం చేయించారు. చివరకు వారి చెర నుంచి తప్పించుకొని శుక్రవారం బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయమై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న రూపా, వీరికి సహకరించిన సర్వర్‌ అనే నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సమావేశంలో డీఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)