Breaking News

Hyd: కుమారి ఆంటీకి బిగ్‌ షాక్‌

Published on Tue, 01/30/2024 - 20:05

నాన్నా.. నాన్నా.. అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ.. టూ లివర్స్‌ ఎక్స్‌ట్రా మీది మొత్తం థౌజండ్‌ అయ్యిందని సోషల్ మీడియాను షాక్‌ అయ్యేలా చేసి ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి. అయితే తాజాగా ఆమెకు షాక్‌ ఇచ్చారు పోలీసులు. ఆమె ఫుడ్‌ కోర్టును బంద్‌ చేయించగా.. తనకు మాత్రమే బంద్‌ చేయించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

ఏ సోషల్‌ మీడియా అయితే ఆమెను ఫేమస్‌ చేసిందో.. అదే ఆమెకు దెబ్బేసింది. ఆమె వీడియోలు వైరల్‌ అయ్యాక ఆ ఫుడ్‌ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్‌తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్‌ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు.  ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు. వారం పాటు దుకాణం బంద్‌ చేయాలని.. ఈలోపు జీహెచ్‌ఎంసీ సమన్వయంతో మరో దగ్గర ఫుడ్‌ కోర్టు తెరుచుకోవాలని ఆమెకు సూచించారు.  

కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. ఆమె స్వస్థలం ఏపీలోని గుడివాడ. నగరంలోని మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. మొదట్లో కేవలం 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి ఫుడ్‌ బిజినెస్‌.. ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోందట!. ప్రేమగా వడ్డించే ఆమె విధానంతో పాటు అక్కడి రేట్లు కూడా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆమె ఓ సెన్సెషన్‌గా మారిపోయారు.

ట్రాఫిక్ పోలీసులు బిజినెస్ క్లోజ్ చేయటంపై కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తన ఒక్కరి బండి మాత్రమే ఆపారని ఆరోపిస్తున్నారు. మిగతా అందరి వ్యాపారాలకు అనుమతి ఇచ్చి తన ఒక్కరిపట్లే ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు.  సోషల్ మీడియా ద్వారానే పైకి వచ్చానని, ఇప్పుడు వారే ఆదుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలంటూ తన వద్దకు వచ్చే ఫుడ్ లవర్స్‌కు కుమారి ఆంటీ విజ్ఞప్తి చేస్తున్నారు. 

అయితే పోలీసులు మాత్రం.. చాలారోజుల నుంచి ఆమెను హెచ్చరిస్తూ వస్తున్నామని చెబుతున్నారు. ఆమె స్టాల్‌ మూలంగానే ఇక్కడ ట్రాఫిక్‌జామ్‌ అవుతోంది. ఈ విషయంపై ఆమెకు చెబుతూ వస్తున్నా.. ఆమె స్పందించలేదు. ఖాళీ చేసి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తని మరోచోట బిజినెస్‌ చేస్కోమని ఆమెకు చెబుతున్నాం. పైగా అది ఆమె సొంత స్థలం కాదు. ఆమెనే కాదు.. ప్రస్తుతం నగరంలో ఉన్న చాలా రోడ్‌సైడ్‌ ఈటరీ స్టాల్స్‌కు అనుమతులు లేవు. ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారం చేసుకుంటే మాకు ఫర్వాలేదు. కానీ, ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఒకవేళ ఈ అంశంపై కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే గనుక మేం ఏం చేయలేం. ఒకవేళ కోర్టు గనుక తొలగించాల్సిందేనని చెబితే మాత్రం తీసేస్తాం అని రాయ్‌దుర్గం ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయానంద్‌ స్పష్టం చేశారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)