Breaking News

పిల్లలను అమ్మే ముఠా గుట్టురట్టు.. గుజరాత్‌ నుంచి నగరానికి తీసుకువచ్చి..

Published on Tue, 02/25/2025 - 15:52

సాక్షి,హైదరాబాద్‌ : రాచకొండలో అంతర్‌రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. 11 మందిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చైతన్యపురి పోలీసులతో మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ జాయింట్‌ ఆపరేషన్‌లో అప్పుడే పుట్టిన నలుగురు పిల్లలను అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

పిల్లలు లేని తల్లిదండ్రులు ఆరాటం.. ఆ దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులను.. ముక్కు పచ్చలారని పసికందుల్ని అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. ఇందులో భాగంగా నిందితులు గుజరాత్‌లో పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులకు డబ్బులు ఎరవేస్తున్నారు. మెడికల్‌ ప్రతినిధుల ద్వారా బేరసారాలు జరిపి అప్పుడే పుట్టిన పిల్లల్ని గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తెస్తున్నారు. నగరంలో ఆడ శిశువును రూ.2.5 లక్షలకు, మగ శిశువును రూ 4.5లక్షలకు విక్రయిస్తున్నారు. 

అయితే, ఛైల్డ్‌ ట్రాఫికింగ్‌పై సమాచారం అందుకున్న హైదరాబాద్‌ పోలీసులు సీక్రెట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతులని సైతం నిందితులుగా చేర్చారు.  

అంతర్ రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)