Breaking News

HYD: నగరంలో ఇవాళ నరకం!

Published on Fri, 07/04/2025 - 11:11

హైదరాబాద్‌ నగర వాసులకు ఇవాళ నరకం కనిపించింది. బిజీ రూట్లలో ఆర్టీసీ బస్సులు లేక.. కిక్కిరిసిన బస్సుల్లోనే ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. విద్యా సంస్థలు, పనులకు, ఆఫీసులకు సమయం అవుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలనూ అనుసరించారు మరికొందరు. ఈ క్రమంలో బాగా ఇబ్బందులు పడ్డారు. 

నగరంలో ఇవాళ ‘రాజకీయ’ పర్యటనల నేపథ్యంలో హడావిడి నెలకొంది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నగరంలో పర్యటిస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ నగరానికి రానున్నారు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఆస్పత్రిలో ఉండడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయి. 

దీంతో.. నగరంలో ఎటు చూసినా రాజకీయ కోలాహలం నెలకొంది. అందుకు తగ్గట్లే పోలీసుల మోహరింపు కనిపించింది. నేతల రాకపోకల నేపథ్యంలో వాహనదారులూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు.. పలు చోట్ల ఇంకా ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

శుక్రవారం ఉదయం నుంచి పలు రూట్లలో ట్రాఫిక్‌ భారీగా జామ్‌ అవుతూ వస్తోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. బిజీ ఫ్లైఓవర్లపై కూడా తీవ్ర రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో.. సాయంత్రం పరిస్థితి ఇంతకు మించే ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు పోలీసులు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)