Breaking News

ఓఆర్‌ఆర్‌పై మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ కోసం హైడ్రామా!

Published on Wed, 07/01/2026 - 07:21

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)పై గత అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న ఓ నేరస్థుడిను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై.. అతడు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. చివరికి పోలీసులు కాల్పులకు దిగడంతో ఓఆర్‌ఆర్‌పై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తెలుగు రాష్ట్రాలకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న భూషణ్‌ శ్రీకాంత్‌ కోసం గత నాలుగు రోజులుగా నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు ప్రత్యేక గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అతడు హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని బొంగులూరు ఎగ్జిట్‌ నంబర్‌-12 సమీపంలో ఓ డీసీఎం వాహనంలో దాక్కున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని చుట్టుముట్టి శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.

అయితే పోలీసులను చూసిన శ్రీకాంత్‌ వారిపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పలుమార్లు హెచ్చరించినా లొంగకపోవడంతో, పరారిని అడ్డుకునేందుకు పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలతో కుప్పకూలిన శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శ్రీకాంత్‌తో పాటు డీసీఎంలో ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నల్లగొండ సీసీఎస్‌ అధికారులు విచారిస్తున్నారు. ఇటు శ్రీకాంత్‌కు చికిత్స పూర్తి కావడంతో నల్లగొండకు తరలించారు.

వందకుపైగా కేసులు! కానిస్టేబుల్‌ హత్య కేసులోనూ..
భూషణ్‌ శ్రీకాంత్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలు, చోరీలు, దాడులు సహా 100కుపైగా క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అంతేకాదు, 2007లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన కానిస్టేబుల్‌ హత్య కేసులో కూడా శ్రీకాంత్‌ ఏ-2 నిందితుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. చాలా కాలంగా పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ నిందితుడిని ఎట్టకేలకు నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు సాహసోపేతంగా పట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

శ్రీకాంత్‌ అరెస్టుతో అతడు పాల్పడిన పలు పాత కేసులు, అతడి నేర ముఠా కార్యకలాపాలు, ఇతర నిందితుల ప్రమేయంపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)