Breaking News

అత్యుత్తమ పర్యాటక నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి

Published on Wed, 03/13/2024 - 04:12

రాంగోపాల్‌పేట్‌(హైదరాబాద్‌): దేశంలోనే అత్యు త్తమ పర్యాటక నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నెక్లెస్‌రోడ్డులోని సంజీవయ్య పార్కులో కేంద్ర పర్యాటక శాఖ సెంట్రల్‌ ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ స్కీమ్‌లో భాగంగా రూ.50 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన లైట్‌ అండ్‌ సౌండ్‌ లేజర్‌షోను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు. ప్రస్తుత మున్న కోహినూర్‌ వజ్రపు కథ స్థానంలో మరిన్ని కథలను తీసుకొస్తూ మార్పులు చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చొరవ తీసుకో వాలని కోరారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ టూరిజం అభివృద్ధి చెందితే ఆదా యంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కోహినూర్‌ కథను రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ పర్యవేక్షణలో రచయిత కంచి రాయగా, సింగర్‌ సునీత గాత్రం, వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం అందించారు. ఇక్కడే నిర్మించిన మల్టీ పర్పస్‌ బాంక్వెట్‌ హాల్‌ను మంత్రులు ప్రారంభించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)