Breaking News

Hyderabad: ‘జూ’ టికెట్‌ ధరలు పెరిగాయ్‌

Published on Sat, 03/01/2025 - 07:32

హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూ పార్కు సందర్శనకు కొత్త టికెట్‌ రేట్లు  ఈ నెల 1 నుంచి (శనివారం) అమలులోకి  రానున్నాయి. గతంలో పెద్దలకు వారం రోజుల్లో రూ.70, చిన్నారులకు రూ.45 ఉండగా.. వీకెండ్‌తో పాటు సెలవు రోజుల్లో రూ.80, రూ.55 ఉండగా.. ప్రస్తుతం రెండు కేటగిరీలుగా కాకుండా వారం రోజుల్లో పెద్దలకు రూ.100, చిన్నారులకు రూ.50గా నిర్ధారించారు. వీటితో పాటు జూ సందర్శనలో వివిధ కేటగిరీలకు కూడా రేట్లు పెరిగాయి. 

కొత్త రేట్లు ఇలా.. 
గతంలో రూ.120 టికెట్‌ ఉన్న స్టిల్‌ కెమెరాకు ప్రస్తుతం రూ.150 వసూలు చేస్తారు. రూ.600 ఉన్న వీడియో కెమెరాకు రూ.1900 పెంచి రూ.2500గా నిర్ధారించారు. ఇక మూవీ కెమెరా షూటింగ్‌ (కమర్షియల్‌)కు రూ.10 వేలు, టాయ్‌ ట్రైన్‌కు పెద్దలకు రూ. 80, చిన్నారులకు రూ.40, బ్యాటరీ వెహికిల్‌ పెద్దలకు రూ.120, చిన్నారులకు రూ. 70, ఒక గంట పాటు తిరిగే 11 సీటర్ల వెహికిల్‌కు రూ.3000, 14 సీటర్ల వెహికిల్స్‌కు 4000, ఏసీ సఫారీ బస్సు ఒకొక్కరికి రూ. 150, నాన్‌ ఏసీ బస్సు రూ.100 చొప్పున కొత్త రేట్లు ఉండనున్నాయి.  

నేవిగేషన్‌ యాప్‌తో.. 
అంతేకాకుండా ప్రస్తుతం జూ సందర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తుగానే బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. మొబైల్‌ నేవిగేషన్‌ యాప్‌తో గైడ్‌ లేకుండానే జూ పార్కును చుట్టి రావచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని జూ సందర్శనకు వెళితే.. అన్ని ఎన్‌క్లోజర్స్‌తో పాటు ఇతర సమాచారం ఇట్టే మన కళ్ల ముందుంటుంది.   

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు