Breaking News

కుటుంబం కోసం భార్య జాబ్‌.. అనుమానంతో భర్త ఏం చేశాడంటే?

Published on Thu, 05/15/2025 - 11:36

సాక్షి, పహాడీషరీఫ్‌: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. తలపై కర్రతో బాది.. గాజుతో చేయి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి భార్యను భర్త హతమార్చాడు.

ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్‌ ఎం.సుధాకర్‌, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్‌ అహ్మద్‌, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్‌ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్‌ జాబ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్నాడు జాకీర్‌. ఆమెపై అనుమానంతో 15రోజుల క్రితం తన మకాంను బాలాపూర్‌ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్‌సిటీ కాలనీకి మార్చాడు.

అలాగే, అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తున్నాడు. ఈనెల 13న రాత్రి 11గంటలకు ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో ఉండగా.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను జాకీర్‌ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి భార్యతో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్నా..  ఆమెపై కోపం తగ్గలేదు. కిటికీకి ఉన్న అద్దాన్ని విరగ్గొట్టి ఓ ముక్కతో ఆమె కుడిచేయి నరాలను కోసేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్‌ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)