Breaking News

కర్ణాటకలోని జలపాతంలో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి

Published on Tue, 06/11/2024 - 11:46

బెంగ‌ళూరు: కర్ణాటకలోని హెబ్బే జలపాతం వద్ద హైద‌రాబాద్‌కు చెందిన‌ 25 ఏళ్ల యువ‌కుడు ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్‌గా గుర్తించాడు. స్నేహితులతో కలిసి స‌ర‌దాగా విహార యాత్ర‌కు వెళ్లి గ‌డ‌పాల‌నుకున్న శ్ర‌వ‌ణ్ క‌థ‌.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విషాదంతంగా మారింది. ఈ ఘటన రాష్ట్రంలోని లింగడహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

వివ‌రాలు.. హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్‌ తన స్నేహితుడితో కలిసి చిక్కమగళూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాడు.  వీరిద్దరూ బైక్‌ అద్దెకు తీసుకుని కొన్ని పర్యటక ప్రాంతాలను సందర్శించారు. సోమవారం కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం వద్దకు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తుండటంతో జలపాతం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఈక్ర‌మంలో జ‌ల‌పాతం  ద‌గ్గ‌ర సెల్ఫీ తీసుకునే ప్ర‌య‌త్నంలో.. శ్ర‌వ‌ణ్, అత‌ని స్నేహితుడు ఇద్ద‌రూ కాలుజారి నీటిలో ప‌డిపోయారు. గమనించిన స్థానికులు వీరిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. అయితే, నీటిలో శ్రవణ్ తలకు బండరాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.

అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలో సిస్టమ్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)