Breaking News

Hyderabad Literary Festival 2025: సాహిత్య సౌరభం..

Published on Sat, 01/25/2025 - 08:20

హైదరాబాద్‌ నగరం ఒక్కసారిగా సాహితీ పరిమళాలను అద్దుకుంది. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన సాహితీ ప్రముఖులు నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో వాలిపోయారు. నగరంలోని టీ–హబ్, సత్వ నాలెడ్జ్‌ సిటీ వేదికలుగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ఫెస్ట్‌ శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు. 

శని, ఆదివారాల్లోనూ కొనసాగనున్న ఈ సాహితీ పండుగలో సాహిత్యం, సంస్కృతి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరించిపోతున్న భారతీయ భాషలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక సదస్సులు, వర్క్‌షాప్స్, కళాప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా సాహితీ ప్రముఖులతో ప్రత్యక్ష చర్చా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. ప్రారంభ ప్లీనరీలో ఏ లైఫ్‌ ఆఫ్‌ సినిమా పై సినీ ప్రముఖులు షభానా అజ్మీ, సాహితీవేత్త అమితా దేశాయ్‌తో చర్చించారు. 

అనంతరకార్యక్రమంలో అంతరించిపోతున్న సింధీ భాషపై ప్రముఖులు నందితా భవానీ, రితా కొఠారీ, సోనీ వాధ్వా చర్చించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా కావ్యధార, స్టేజ్‌ టాక్స్, ఆర్ట్‌ వర్క్‌ షాప్స్, నన్హా నుక్కడ్‌ కార్యక్రమాలు, పరిశోధనా రంగ ప్రముఖులతో సైన్స్‌ అండ్‌ ది సిటీ సెషన్స్, రచయితలకు సంబంధించిన మీట్‌మై చర్చ నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న కళా ప్రదర్శనలు, నగరంలోని కొండరాళ్ల సంరక్షణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.  

కార్టూన్‌ స్పెషల్‌.. 
ఈ ఫెస్ట్‌లో భాగంగా ప్రముఖ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య ఆధ్వర్యంలోని అబ్ట్యూస్‌ యాంగిల్‌ కార్టూన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య మాట్లాడుతూ.. ఇది నగర ఖ్యాతిని మరింత పెంచుతుందని, ఈ తరం ఆలోచనా విధానానికి స్ఫూర్తి నింపే వ్యక్తులు హాజరుకావడం సంతోషమన్నారు. తన కార్టూన్‌ పుస్తకంలో బ్యూరోకాట్ల ప్రయాణాన్ని, ఆలోచనా విధానాన్ని కార్టూన్ల రూపంలో తెలిపానన్నారు. ఫొటోలతో ప్రత్యేక చిత్ర ప్రదర్శనను ఏరాప్టు చేశారు. పుస్తకావిష్కరణలో ప్రముఖ రచయిత డా.దినేష్‌ శర్మ, రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారి డా.ఎస్‌ఎన్‌ మోహంతి పాల్గొన్నారు.

యాన్‌ యాక్సిడెంటల్‌ సూపర్‌ హీరో 2లోనే క్లైమాక్స్‌.. 
అనంతరం ప్రముఖ సినీతార హుమా ఖురేషి ముఖ్య అతిథిగా సాహితీవేత్త కిన్నెర మూర్తితో చర్చించారు. ఈ సందర్భంగా హుమా ఖురేషి రాసిన యాన్‌ యాక్సిడెంటల్‌ సూపర్‌ హీరో పుస్తకంలోని కొన్ని అంశాలను చదివి వివరించారు. ఈ పుస్తకం క్లైమాక్స్‌ త్వరలో రానున్న రెండో పుస్తకంలో ఉంటుందన్నారు. సినిమా ఎంపికలో కథే ప్రామాణికంగా చేస్తానని, యాక్షన్‌ కామెడీ వంటి చిత్రం చేయడం ఇష్టమని వెల్లడించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)