Breaking News

‘విమోచన’ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు

Published on Mon, 09/18/2023 - 03:55

రసూల్‌పురా (హైదరాబాద్‌): హైదరాబాద్‌ విమోచన దినోత్సవం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం జరిగిన హైదరాబాద్‌ విమోచన దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ విమోచన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో పాలుపంచుకోవడం స్ఫూర్తిదాయకమని అన్నారు.

హైదరాబాద్‌ ప్రాంత చరిత్ర, రజాకార్ల దౌర్జన్యాలు, హైదరాబాద్‌ స్టేట్‌ను భారతదేశంలో విలీనం చేసిన పరిస్థితులు.. వంటి చరిత్రను నేటి విద్యార్థులు తెలుసుకోవాలని గవర్నర్‌ సూచించారు. గత మూడు రోజులుగా రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ రాగ్‌ (గానం), ఆజాదీ కా యాక్ట్స్‌ (స్కిట్, డ్రామా) క్విజ్‌లో (ప్రహేలికా) భారత సారస్వతం, ఫొటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, ఓపెన్‌ మైక్‌ సెషన్, ప్యానల్‌ చర్చలు, ఇతర అంశాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు మెమెంటో, ప్రశంసాపత్రాలు, కన్సొలేషన్‌ బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అదనపు కార్యదర్శి డాక్టర్‌ రాకేశ్‌ గుప్త, డిప్యూటీ సెక్రటరీ స్వాతి షాహి, కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు, సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ బీజే రావు, పరిపాలనాధికారి రజనిప్రియ, సిబ్బంది పాల్గొన్నారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)