Breaking News

మాట తప్పాడని మట్టుబెట్టారు

Published on Sun, 09/14/2025 - 07:58

కుషాయిగూడ: కొన్నేళ్ల పాటు తమను వెంట తిప్పుకున్నాడని.. మీ లైఫ్‌ సెట్‌ చేస్తా.. మంచి జీవితాన్నిస్తానని.. తీరా పక్కకు తప్పించాడని కక్ష పెంచుకున్నవారు శుక్రవారం నడిరోడ్డుపై ఓ రియల్టర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. నమ్మినవారే హత్యకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని కొందరు, వాటాల పంచాయితీ అని మరికొందరు అంటుండగా.. అసలు విషయం మరోవిధంగా ఉన్నట్లు సమాచారం. 

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌– హెచ్‌బీకాలనీ డివిజన్‌ పరిధిలోని మంగాపురం కాలనీలో నివసించే శ్రీకాంత్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌తో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు. లాలాపేట్‌కు చెందిన ఓ రౌడీషిటర్‌.. శ్రీకాంత్‌రెడ్డితో కలిసి వ్యాపారం చేసేందుకు  రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో కొంత కాలం క్రితం పెట్టుబడి పెట్టిన రౌడీషిటర్‌ చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు డబ్బుల కోసం శ్రీకాంత్‌రెడ్డిని అడగసాగారు. 

తనకు వ్యాపారంలో నష్టం వచి్చందని నెట్టుకువచ్చాడు. విసిగి వేసారిపోయిన రౌడీషిటర్‌ సంబంధీకులు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. రూ.2 కోట్ల పెట్టుబడి, మిగిలిపోయిన విషయాలు శ్రీకాంత్‌రెడ్డి వెంట ఉండేæ ధన్‌రాజ్, జోసెఫ్‌లకు కూడా తెలుసు. ఈ విషయంపై పలుమార్లు మాట్లాడుకున్నారు. రూ.2 కోట్లు మిగిలాయి కదా..  తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని వారు అడిగినట్లు సమాచారం. ఆ సమయంలో శ్రీకాంత్‌రెడ్డి  సరే అనడంతో వారు ఆశలు పెంచుకున్నారు.  

బీరు తాగించి.. 
రూ.10 లక్షల విషయాన్ని ధన్‌రాజ్, జోసెఫ్‌లు పలుమార్లు ప్రస్తావించడంతో విసుగుచెందిన శ్రీకాంత్‌రెడ్డి.. మీతో నాకు సంబంధం లేదంటూ వారిని పక్కకు పెట్టినట్లు తెలిసింది. దీంతో వారు పగ పెంచుకున్నారు.  పది రోజుల క్రితం  మరోసారి శ్రీకాంత్‌రెడ్డిని ఆశ్రయించారు. డబ్బుల కోసం వేడుకున్నారు. అయినా శ్రీకాంత్‌రెడ్డి తీరులో మార్పు రాకపోవడంతో «ధన్‌రాజ్, జోసెఫ్‌లు శుక్రవారం మధ్యాహ్నం నుంచే మద్యం తాగారు. మద్యం మత్తులో హెచ్‌బీకాలనీ, మంగాపురంలోని శ్రీకాంత్‌రెడ్డి ఆఫీసుకు వెళ్లారు. వారితో పాటు తీసుకువచి్చన బీరులోంచి ఓ గ్లాసు శ్రీకాంత్‌రెడ్డికి పోసి తాగించారు. చివరి  ప్రయత్నంగా మరోసారి డబ్బులు ఇవ్వాలని బతిమిలాడారు. అప్పటికీ శ్రీకాంత్‌రెడ్డి మాట తీరులో ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో ఆగ్రహానికి లోనై అతడి గల్లా పట్టుకొని ఆఫీసు బయటికి ఈడ్చుకు వచ్చి కాలనీలో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశారు. వీరిద్దరితో పాటు మూడో వ్యక్తి సైతం శ్రీకాంత్‌రెడ్డి ఆఫీసుకు వచి్చనట్లు తెలిసింది. ఆ మూడో వ్యక్తి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్‌రెడ్డి హత్య కేసు నిందితులు ధన్‌రాజ్, జోసెఫ్‌తో పాటు మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.   
  
 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)