Breaking News

హైడ్రా సేవలు ఆగిపోలేదు: కమిషనర్‌ రంగనాథ్‌

Published on Mon, 08/11/2025 - 11:40

హైదరాబాద్‌, సాక్షి:  హైడ్రా  (Hyderabad Disaster Response and Action) కంట్రోల్ రూమ్‌ సేవలు బంద్‌ అయ్యాయన్న కథనాలపై కమిషనర్‌ రంగనాథ్‌ స్పందించారు. హైడ్రా విధులు ఎక్కడా ఆగలేదని.. ప్రజా వాణి యధాతథంగా కొనసాగుతోందని సోమవారం మధ్యాహ్నాం స్పష్టం చేశారాయన. 

ఈ ఉదయం.. జీతాలు తగ్గించడంతో మార్షల్స్‌ విధులు బహిష్కరించారన్నది తెలిసిందే. ఆపై బైక్‌ ర్యాలీ చేపట్టారు. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో వీళ్లు అందించే ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే హైడ్రా వర్షాకాల సేవలపై ప్రభావం పడుతుందని అంతా భావించారు. ఈలోపు.. సేవలేం ఆగిపోలేదని హైడ్రా ప్రకటించడం గమనార్హం.

హైదరాబాద్ నగరంలో వర్షాకాలం నేపథ్యంలో HYDRA యంత్రాంగం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు రంగంలోకి దిగి సేవలు ప్రారంభించింది. ఈ సేవల్లో మార్షల్స్‌, DRF బృందాలు, ట్రాఫిక్ సపోర్ట్ టీమ్‌లు, క్లీన్-అప్ సిబ్బంది భాగంగా ఉన్నారు. మొత్తం 150 డివిజన్‌లలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు (METs): ఒక్కో టీమ్‌లో 4 మంది, మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.

ఇందులో డీఆర్‌ఎఫ్‌ బృందాలు 51 టీమ్‌లు ఉండగా.. మొత్తం 918 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే.. స్టాటిక్ బృందాలు 368 ఉండగా.. నీటి నిలయాల వద్ద 734 మంది ఉన్నారు. 21 బైకులతో ఎమర్జెన్సీ బైక్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇక ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజల భధ్రత, సమన్వయం కోసం మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. వీళ్లలో మాజీ సైనికులే ఎక్కువగా ఉన్నారు.  మొత్తంగా.. మాన్‌పవర్‌ 4,100 మంది ఉన్నారు. 

వానా కాలంలో నీరు తొలగించేందుకు పంపులు, చెట్ల కట్ మిషిన్లు, క్లీన్-అప్ టూల్స్ వీళ్లకు అందిస్తున్నారు. ప్రతి బృందానికి ఒక్కరోజులోనే సత్వర శిక్షణ ఇప్పించారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో ఈ సిబ్బంది సేవలు అందిస్తూ వస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)