Breaking News

అసైన్డ్‌ భూములను లాక్కోవడం లేదు: హరీశ్‌

Published on Fri, 02/10/2023 - 04:52

సాక్షి, హైదరాబాద్‌: ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా అసైన్డ్‌ భూములను లాక్కోవట్లేదని మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. బడ్జెట్‌ పద్దులపై గురువారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ అంశంపై ఈ మేరకు విపక్షాలు ఆరోపించగా వాటిలో వాస్తవం లేదని మంత్రి తోసిపుచ్చారు. అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం రూ.70 లక్షల నుంచి రూ.కోటి పరిహారాన్ని రైతులకు ఇచ్చిందని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిస్తేనే తీసుకుంటున్నామని చెప్పారు.

సాగుకు యోగ్యంకాని అసైన్డ్‌ భూములనే తీసుకుంటున్నామన్నారు. కాగా, ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఓ బీజేపీ ఎంపీ ఇటీవల ప్రధాని మోదీని కలిశారని, ఇది ఆ పార్టీ విధానామా? లేక ఆ ఎంపీ వ్యక్తిగత అభిప్రాయమో చెప్పాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావు పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన తీరును తప్పుబట్టారు. ఒకవేళ ఈ చర్య ఆ ఎంపీ వ్యక్తిగత అభిప్రాయమైతే ఆయనను బీజేపీ నుంచి సస్పెండ్‌ చేయాలని, లేకుంటే బీజేపీ క్షమాపణ చెప్పాలని కోరారు.


 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)