Breaking News

జీనోమ్‌ వ్యాలీలో గ్లాండ్‌ ఫార్మా పెట్టుబడి రూ.400 కోట్లు 

Published on Tue, 02/21/2023 - 01:26

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ గ్లాండ్‌ ఫార్మా రాష్ట్రంలోని జీనోమ్‌ వ్యాలీలో మరో రూ.400 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించింది. జీనోమ్‌ వ్యాలీలో బయోలాజికల్స్, బయో సిమిలర్, యాంటీబాడీస్, రీకాంబినెంట్‌ ఇన్సులిన్‌ తయారీకి ఇప్పటికే ఉన్న సామర్థ్యాన్ని ప్రస్తుత పెట్టుబడితో గ్లాండ్‌ ఫార్మా విస్తరిస్తుంది. తద్వారా స్థానికంగా అర్హత, నైపుణ్యం కలిగిన 500 మందికిపైగా యువతకు ఉపాధి కల్పిస్తుంది.

గ్లాండ్‌ ఫార్మా ఎండీ, సీఈఓ శ్రీనివాస్‌ సదు సోమవారం మంత్రి కేటీ రామారావుతో భేటీ సందర్భంగా గ్లాండ్‌ ఫార్మా కార్యకలాపాల విస్తరణకు రూ.400 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్‌లు, బయోలాజికల్స్, బయోసిమిలార్, యాంటీబాడీస్‌ తదితర అధునాతన రంగాల్లో ఔషధాల తయారీకి 2022లో రూ.300 కోట్లతో జీనోమ్‌ వ్యాలీలో గ్లాండ్‌ ఫార్మా బయో ఫార్మాసూటికల్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.

దీనిద్వారా 200 మందికి ఉద్యోగాలు కల్పించింది. కాగా గ్లాండ్‌ ఫార్మా తాజా పెట్టుబడిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. జీనోమ్‌ వ్యాలీలో గ్లాండ్‌ ఫార్మా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ విభాగం సీఈవో శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)