నగరంలో 10వేలకు పైగా స్టార్టప్స్‌..

Published on Fri, 07/31/2026 - 09:56

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని స్టార్టప్‌లకు  అత్యంత అనుకూలమైన నగరంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది మన హైదరాబాద్‌. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, తక్కువ నిర్వహణ వ్యయం, సంస్థాగత సహకారం వంటి అంశాలు నగరాన్ని స్టార్టప్‌లకు ప్రధాన కేంద్రంగా నిలబెట్టాయని ఎండియా పార్ట్‌నర్స్‌ విడుదల చేసిన ‘హైదరాబాద్‌ స్టార్టప్‌ రెడీనెస్‌ ఇండెక్స్‌–2026’ వెల్లడించింది.

ఆవిష్కరణలకు, యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నెలవైన స్టార్టప్స్‌తో దేశంలోనే అగ్రగామి స్టార్టప్‌ హబ్‌గా సిటీ రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్‌ స్టార్టప్‌ ఇండెక్స్‌లోని ఇన్నొవేషన్‌ రిపోర్ట్‌ స్టార్టప్‌ రంగంలో నగర  పురోగతికి అద్దం పట్టింది. మొత్తంగా 216 మంది వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు పర్యావరణ వ్యవస్థ (ఎకో సిస్టమ్‌) భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

పన్నెండేళ్లలో 384కుపైగా ఒప్పందాలు..
నగరంలో ఏర్పాటైన స్టార్టప్స్‌ సంఖ్య 10వేలు దాటిందని నివేదిక పేర్కొంది. గత 2014 నుంచి చూస్తే ఈ పన్నెండేళ్లలో 384కు పైగా ఒప్పందాలను ఈ రంగం కుదుర్చుకుందని తద్వారా 3 బిలియన్‌ డాలర్లకు పైగా వెంచర్‌ ఫండింగ్‌ను ఆకర్షించిందని నివేదిక తేలి్చంది.  దేశంలోని మొత్తం ’గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్స్‌’ (జీసీసీ)ల్లో  దాదాపు 20 శాతం అంటే 355కుపైగా కేంద్రాలకు నగరం వేదికగా నిలుస్తోందని నివేదిక వివరించింది.

వృద్ధి పథంలో..
- స్టార్టప్‌లు: 10,000కు పైగా
- 2014 నుంచి వెంచర్‌ పెట్టుబడులు: 3 బిలియన్‌ డాలర్లకు పైగా
- పెట్టుబడి ఒప్పందాలు: 384కుపైగా
- గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ): 355కుపైగా
- దేశంలోని మొత్తం జీసీసీల్లో హైదరాబాద్‌ వాటా: దాదాపు 20%

నగర బలాబలాలివే..
సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది మౌలిక వసతులు, కనెక్టివిటీనే హైదరాబాద్‌కు అతిపెద్ద బలంగా పేర్కొన్నారు. అదే విధంగా 38 శాతం మంది నైపుణ్యం కలిగిన ప్రతిభ అందుబాటులో ఉండటం నగర ఘనతగా భావించగా, 36 శాతం మంది తక్కువ వ్యయంతో వ్యాపారం నిర్వహించగలగడం నగరానికి ప్రధాన పోటీ ప్రయోజనాలని అందిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే, 33 శాతం మంది పెట్టుబడుల లభ్యత, 29 శాతం మంది మార్కెట్‌ అవకాశాల విస్తరణపై మరింతగా దృష్టి సారించాలని సూచించారు.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)