Breaking News

ముంబై, ఢిల్లీ సరసన హైదరాబాద్‌!

Published on Fri, 08/02/2024 - 04:57

జీహెచ్‌ఎంసీలో ఉన్న ఉప్పల్‌ పక్కనే పీర్జాదిగూడ, బోడుప్పల్‌ కార్పొరేషన్లు.. వాటి పక్కనే కొర్రెముల గ్రామ పంచాయతీ...ఆ తరువాత పోచారం మున్సిపాలిటీ. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని పరిస్థితి ఇది. ఒక దగ్గర 60 ఫీట్ల రోడ్డు ఉంటే ఆ వెంటనే 40 ఫీట్ల రోడ్డు, డ్రైనేజీ.. ఆయా రోడ్లలో వరదనీటి కాలువల అనుసంధానమే లేదు. వివిధ సంస్థలు చేపట్టే పనులకు పొంతన ఉండట్లేదు. అందుకే ఔటర్‌ రింగురోడ్డు లోపల ఉన్న అర్బన్‌ పరిధిని ఒకే సంస్థ పరిధిలోకి తేవాలని నిర్ణయించాం. – ఇటీవల మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ముంబై, ఢిల్లీ వంటి అతిపెద్ద నగరాల సరసన హైదరాబాద్‌ చేరబోతోంది. ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న ప్రాంతాన్ని ఒకే గొడుగు కిందకు తేవాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీని ఆనుకొని ఉన్న ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయితీలను కలిపి అతిపెద్ద కార్పొరేషన్‌గా రూపొందించాలని సీఎం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) పేరుతో ఇప్పటికే ఓ సంస్థను ఏర్పాటు చేశారు.

2,053 చదరపు కిలోమీటర్ల పరిధిలోని జీహెచ్‌ఎంసీతోపాటు శివారు పురపాలికలు, గ్రామాల్లో విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలను తొలగించడం, ట్రాఫిక్‌ నిర్వహణ, తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో కీలకంగా వ్యవహరించేలా ఈ సంస్థకు విధులు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, పురపాలికల్లో గ్రామాల విలీనానికి సంబంధించి సీఎం రేవంత్‌.. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్కతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వనుంది. 

గ్రామాలు పురపాలికల్లో... ఆ తరువాత జీహెచ్‌ఎంసీలో జీహెచ్‌ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా రక్షణ శాఖ పరిధి నుంచి ప్రభుత్వ అ«దీనంలోకి వచి్చన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ 40.17 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. 2024 జనాభా అంచనాల ప్రకారం ఈ రెండింటిలో కలిపి 1.06 కోట్ల జనాభా ఉంది. ఇవి కాకుండా శివార్లలోని బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీని ఆనుకొని ఓఆర్‌ఆర్‌ లోపలే ఉన్నాయి.

వాటితోపాటు మరో 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. విలీన ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పాలకమండళ్ల పదవీకాలం ముగిసిన పంచాయతీలను వాటికి సమీపంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయనున్నారు. ఆయా గ్రామాలను పురపాలికల్లో కలిపిన అనంతరం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ పూర్తికానుంది. 

ఓఆర్‌ఆర్‌ ఆవల ఉన్న కొన్నింటిని కూడా... 
హైడ్రా ప్రాజెక్టులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలతోపాటు సంగారెడ్డి జిల్లా పరిధిలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలు, ఓఆర్‌ఆర్‌ అవతల ఉన్న ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, దుండిగల్‌ వంటి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను కూడా కలిపారు. 33 గ్రామ పంచాయతీల్లో ఓఆర్‌ఆర్‌ ఆవల సైతం కొన్ని గ్రామాలు ఉన్నాయి. అయితే జీహెచ్‌ఎంసీలో వాటి విలీనం ఉంటుందా ఉండదా అనే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం తేలుస్తుందని ఓ అధికారి తెలిపారు. 

విలీనమైతే భారీ నగరాల చెంతన 
ఓఆర్‌ఆర్‌ లోపలి పట్టణాలు, గ్రామాలు జీహెచ్‌ఎంసీలో విలీనమైతే ‘హైడ్రా’పరిధిలో జనాభా 1.29 కోట్లకు చేరుతుంది. గ్రేటర్‌ ముంబై (ఎంసీజీఎం)లో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1.24 కోట్లుకాగా తాజా అంచనాల ప్రకారం ఈ జనాభా 1.75 కోట్లకు చేరవచ్చని తెలుస్తోంది. అలాగే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ (ఎంసీబీ) జనాభా కూడా 2011 లెక్కల ప్రకారం 1.10 కోట్లుగా ఉండగా తాజా లెక్కల్లో కోటిన్నరకు చేరుకొనే అవకాశం ఉంది.

బృహత్‌ బెంగుళూరు (బీబీఎంపీ) జనాభా (2011 లెక్కలు) 68 లక్షలుకాగా జీహెచ్‌ఎంసీలో జనాభా 2011 లెక్కల ప్రకారం 69.93 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు విలీనమైతే ముంబై, ఢిల్లీ తరహాలో అధిక జనాభాగల నగరాల సరసన చేరనుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)