Breaking News

హైద‌రాబాద్‌లో ‘హాక్‌ 2.0’కు కసరత్తు!

Published on Fri, 10/25/2024 - 13:12

సాక్షి, హైద‌రాబాద్‌: సైబర్‌ నేరాల పట్ల అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరినీ సైబర్‌ వారియర్స్‌గా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన సైబర్‌ సెక్యూరిటీ నాలెడ్జ్‌ సమ్మిట్స్‌ను మరోసారి నిర్వహించాలని సిటీ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ నిర్ణయించారు. గత ఏడాది ఆయన హైద‌రాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌గా ఉండగా తొలి హాక్‌–2023 సమ్మిట్‌ నిర్వహించారు. తాజాగా మరోసారి హైదరాబాద్‌ సైబర్‌ సెక్యూరిటీ నాలెడ్జ్‌ సమ్మిట్‌–2024కు (హాక్‌ 2.0) సన్నాహాలు చేస్తున్నారు.

నగర పోలీసు విభాగం, హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ (హెచ్‌సీఎస్‌సీ) సంయుక్తంగా నిర్వహించే ఈ సమ్మిట్‌ వచ్చే నెల 6న నగరంలోని ది పార్క్‌ హోటల్‌లో జరుగనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రతి ఏడాదీ ఇలాంటి సమ్మిట్స్‌ నిర్వహించాలని, సైబర్‌తో పాటు ట్రాఫిక్, నార్కోటిక్స్, ఉమెన్‌ సేఫ్టీ విభాగాలకు వీటిని విస్తరించాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గతంలోనే నిర్ణయించారు.

యువత... ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న చేపట్టబోయే సైబర్‌ సమ్మిట్‌లో కొన్ని విద్యా సంస్థలకు చెందిన సైబర్‌ స్వ్కాడ్స్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. వీళ్లు వారి పాఠశాలల్లో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త ముప్పులు పుట్టుకువస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరికీ సైబర్‌ సెక్యూరిటీ అన్నది అత్యంత కీలకాంశంగా మారింది. దీనికోసమే సిటీ పోలీసులు, హెచ్‌సీఎస్సీ కలిసి పనిచేస్తూ ఈ సమ్మిట్‌ నిర్వహిస్తున్నాయి.

చ‌ద‌వండి: సైబర్‌ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)