Breaking News

తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం.. సీఐడీపై సజ్జనార్‌ ప్రశంసలు

Published on Wed, 01/21/2026 - 20:42

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఐడీ రూపొందించిన నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నూతన విధానంలో బాధితుడు ఆసుపత్రిలో ఉన్నా అక్కడికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు. ప్రతీ కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తాజాగా మాట్లాడుతూ..‘తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం, ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోలీసులే బాధితుల ఇంటి వద్దకు వెళ్తారు. హైదరాబాద్‌లో పకడ్బందీగా అమలులోకి విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా నూతన విధానం ఉంటుంది. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ కేసులకు వర్తింపు ఉంటుంది. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేరుగా ఫిర్యాదు స్వీకరిస్తారు.

నూతన విధానంలో బాధితుడు ఆసుపత్రిలో ఉన్నా అక్కడికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. బాధితుల గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సేవలు ఉంటాయి. విధానం అమలులో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులను అకారణంగా స్టేషన్‌కు పిలిస్తే సంబంధిత అధికారులదే బాధ్యత. ప్రతీ కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. ఫిర్యాదు లేదా ఎఫ్ఐఆర్ నమోదు జరగకపోతే హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలకు ఇప్పటికే ప్రారంభమైన సీ-మిత్రతో పాటు ఈ విధానం ప్రజలకు మరింత మేలు చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)