Breaking News

కాసేపు టీచర్‌గా మారిన హైదరాబాద్‌ కలెక్టర్‌

Published on Fri, 03/15/2024 - 08:40

నాంపల్లి: హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికార హోదాను కాసేపు పక్కన పెట్టి టీచర్‌గా మారిపోయారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. టీచర్లలో ఉత్తేజం నింపారు. ఈ సన్నివేశం గురువారం మల్లేపల్లిలో చోటుచేసుకుంది.

స్థానిక తెలుగు, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదు లను సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. విద్యా ర్థులు చదువుతున్న తీరును గమనించారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయులతో బోధనలు చేయించారు. ‘పాఠం అర్థమైందా పిల్లలూ..’అని ఆరా తీశారు.   కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్‌ హుస్సేన్, డీఈఓ రోహిణి, తహసీల్దార్‌ జ్యోతి పాల్గొన్నారు. 

ఇన్‌స్పెక్టర్‌కు చురకలు..  
మల్లేపల్లి ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలుపులను ఆకతాయి లు రాత్రివేళల్లో పగులగొట్టి లోనికి చొరబడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీచర్లు  కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనూ స్కూల్‌లోని కంప్యూటర్లు ఎత్తుకెళ్లారని చెప్పారు.  అయితే అక్కడే ఉన్న హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ టంగుటూరి రాంబాబును పిలిచి ‘దొంగలు పడితే ఏం చేస్తున్నారు’ అని కలెక్టర్‌ చురకలు అంటించారు. వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్‌ నాంపల్లి ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)