Breaking News

Hyderabad Book Fair: పుస్తకం పిలిచింది!

Published on Mon, 12/23/2024 - 08:33

సాక్షి, హైదరబాద్‌: నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం సందర్శకులతో పోటెత్తింది.సెలవురోజు కావడంతో పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యువత, విద్యార్థులు, పిల్లలతో స్టాళ్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా చిన్నారులు తమకిష్టమైన ఆంగ్ల కథలు, క్లాసిక్స్‌ పుస్తకాలను విరివిగా కొనుగోలు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి  నెలకొంది. 

పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది. ప్రదర్శన ప్రారంభమై నాలుగు రోజులైంది. రెండు రోజులుగా పుస్తక ప్రియుల నుంచి అనూహ్య స్పందన  కనిపిస్తోందని  నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కొత్త  సంవత్సరం పుస్తక పఠనంతో  ప్రారంభం కావాలనే  ఆకాంక్షతో ఎక్కువ మంది తమకు నచి్చన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.  సాధారణంగా వయోధికులే ఎక్కువగా పుస్తకాల పట్ల ఆసక్తి, అభిరుచి కలిగి ఉంటారనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ  యువత  పెద్ద సంఖ్యలో  కనిపించడం విశేషం.  

రాజ్యాంగం 5 రకాలుగా.. 
భూమిపుత్ర, బహుజన పుస్తక ప్రచురణ సంస్థలకు చెందిన స్టాల్‌ నంబర్లు 203, 204లలో భారత రాజ్యాంగం గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. బాబా సాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పిల్లలు, పెద్దలు నచ్చేలా 5 రకాలుగా ముద్రించి ప్రదర్శనలో ఉంచారు.   

నేడు పుస్తక నడక..  
పుస్తక పఠనంపై ప్రజల్లో ఆసక్తిని, అభిరుచిని, అవగాహనను పెంపొందించే లక్ష్యంతో సొమవారం  పుస్తక నడక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ నిర్వాహకులు తెలిపారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి  ఎనీ్టఆర్‌ స్టేడియం వరకు జరగనున్న ప్రదర్శనలో పాఠకులు, రచయితలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)