Breaking News

బోడుప్పల్‌లో ఘోర ప్రమాదం.. బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం

Published on Wed, 01/28/2026 - 06:30

సాక్షి, హైదరాబాద్‌: మితిమీరిన వేగం ప్రాణాలు తీసింది. నగరంలోని బోడుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపు తప్పి పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే..  

మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. ఐటీ పోచారం వెళ్తున్న ఓ కారు.. బోడుప్పల్‌ వద్ద పిల్లర్‌ 97ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడినవాళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను, క్షతగాత్రులను వనపర్తికి చెందిన బీటెక్‌ విద్యార్థులుగా గుర్తించారు. 

ఘటన సమయంలో కారులో ఎనిమిది మంది యువకులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీళ్లంతా వనపర్తిలో ఇంజినీరింగ్‌ చదువుతున్నట్లు తెలిపారు. అతివేగంతో దూసుకెళ్లే క్రమంలో వాహనం కంట్రోల్‌ కాకపోవడంతో ఫిల్లర్‌ను ఢీ కొట్టినట్లు భావిస్తున్నారు. మృతులను వరుణ్‌, నిఖిల్‌గా గుర్తించారు. ఆ మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. గాయపడిన వెంకట్‌, రాకేష్‌,యశ్వంత్‌లకు చికిత్స కొనసాగుతోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి