Breaking News

మాల్‌.. క్యాపిటల్‌

Published on Thu, 07/23/2026 - 04:35

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత రిటైల్‌ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాన నగరాల్లో ఈ విస్తరణను భారీ షాపింగ్‌ మాల్స్‌ శాసిస్తున్నాయి. దేశంలో అత్యధిక మాల్‌ విస్తీర్ణం, అత్యధిక మాల్స్‌గల నగరాల జాబితాలో ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు తర్వాతి స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. ఈ విషయంలో చెన్నై, పుణే, కొచ్చి, కోల్‌కతా తదితర నగరాలు హైదరాబాద్‌కన్నా దిగువన ఉన్నాయి. ఈ నగరాల్లో అంతర్జాతీయ బ్రాండ్లు, లగ్జరీ స్టోర్లు, ఫుడ్‌–ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు పెద్ద ఎత్తున ఏర్పడటంతో ఇవి షాపింగ్‌ టూరిజానికి కేంద్రాలుగా కూడా మారుతున్నాయి. 

అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ అక్కడే... 
ప్రస్తుతం విస్తీర్ణంపరంగా దేశంలోనే అతిపెద్ద షాపింగ్‌ మాల్‌గా కేరళలోని కొచ్చిలో ఉన్న లులు మాల్‌ గుర్తింపు పొందింది. దీని మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారు 25 లక్షల చదరపు అడుగులు. ఇందులో 300కుపైగా బ్రాండ్లు, మల్టీప్లెక్స్, హైపర్‌ మార్కెట్, ఫుడ్‌ కోర్టులు, వినోద సదుపాయాలు భాగంగా ఉన్నాయి. దీంతో పోటీపడుతూ నగరంలోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ కూడా దేశంలోని అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా నిలిచింది.

హైదరాబాద్‌ ప్రత్యేకత అదే 
మొత్తం మాల్‌ విస్తీర్ణంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల తర్వాతి స్థానంలో హైదరాబాద్‌ ఉన్నప్పటికీ వేగవంతమైన మాల్‌ కల్చర్‌ వృద్ధిలో హైదరాబాద్‌ ముందుంది. భాగ్యనగరంలోని మాల్స్‌లో సగానికిపైగా ‘గ్రేడ్‌ ఎ’ మాల్స్‌ కావడం విశేషం. నాణ్యతపరంగా హైదరాబాద్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఇటీవల నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక వెల్లడించింది. ఐటీ ఉద్యోగులు, అధిక కొనుగోలు శక్తి, కొత్త నివాస ప్రాంతాల అభివృద్ధి కారణంగా గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీ మాల్స్‌ వేగంగా పెరుగుతున్నాయి.  

భవిష్యత్తు నగరానిదే... 
రిటైల్‌ కన్సల్టెన్సీ సంస్థల నివేదికల ప్రకారం కొత్త మాల్స్‌ ప్రారంభం, అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశం, ఐటీ కారిడార్‌ విస్తరణతో హైదరాబాద్‌లో రిటైల్‌ రంగం మిగిలిన నగరాలకన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025 ద్వితీయార్ధంలో దేశంలో రిటైల్‌ లీజింగ్‌లోనూ హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. రాబోయే కొన్నేళ్లలో హైదరాబాద్‌ షాపింగ్‌ రంగం అనూహ్యమైన వేగంతో అభివృద్ధి చెందనుంది. దీనికి నగరవ్యాప్తంగా ప్రస్తుతం నిర్మాణంలో అనేక మాల్స్, రిటైల్‌ కేంద్రాలు ఊతం ఇవ్వనున్నాయి. అభివృద్ధి చెందుతున్న నివాస, వాణిజ్య కేంద్రాల్లో రాబోయే ప్రాజెక్టులు, నగర విస్తరణకు తోడ్పడుతూ నివాసితులకు షాపింగ్, వినోదం, భోజన సౌకర్యాలను మరింత చేరువ చేయనున్నాయి.  

లైఫ్‌ స్టైల్‌ చిరునామాలుగా... 
కోకాపేట్, నార్సింగి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, రాజేంద్రనగర్, శంషాబాద్, మణికొండ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మరికొన్ని ప్రాజెక్టులు రానున్నాయి. పలు ప్రాజెక్టుల్లో మల్టీప్లెక్స్‌లు కూడా భాగం కావడంతో ఇవి కేవలం షాపింగ్‌ కేంద్రాలుగా కాకుండా జీవనశైలి కేంద్రాలుగా మారనున్నాయి. వాటిలో దేశంలోనే అతిపెద్ద మాల్‌గా చెబుతున్న నార్సింగిలోని లులు మాల్‌ కూడా ఉంది. దాదాపుగా 40 లక్షల చదరపు అడుగులకుపైగా కొత్త షాపింగ్‌ ఏరియా వస్తుండటంతో కోటిన్నర చదరపు అడుగులకు నగరం చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)