Breaking News

హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌.. భారీ వర్ష సూచన

Published on Mon, 09/15/2025 - 07:34

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తెలంగాణ, విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది.

దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.   

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైంది. సాధారణంగా సెప్టెంబర్‌ మూడో వారం చివరలో మొదలవ్వాల్సిన ఈ ప్రక్రియకు ఈసారి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ముందే ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాజస్తాన్, పంజాబ్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు క్రమంగా నిష్క్రమిస్తూ అక్టోబర్‌ రెండో వారాంతానికి దేశం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని వివరించింది.

ఈ సమయంలోనూ చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు గతేడాది కంటే మూడు రోజుల ముందే.. మే 23న కేరళను తాకాయి. ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూలై రెండో వారం నాటికి దేశమంతా విస్తరించాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సగటున 74.06 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 83.02 సెం.మీ. మేర వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతంకన్నా 12 శాతం అధికం.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)