Breaking News

భార్య మీద అనుమానంతో దుబాయ్ నుంచి వచ్చి...

Published on Fri, 11/01/2024 - 08:06

కరీంనగర్ (మల్లాపూర్‌): అనుమానం పెనుభూతమై భార్యను గొంతు నొక్కి అతికిరాతకంగా చంపేశాడోభర్త. ఈ దారుణం మండలంలోని వెంకట్రావ్‌పేటలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన వెల్మల రమేశ్‌కు రాయికల్‌ మండలం అల్లీపూర్‌ గ్రామానికి చెందిన సునీతతో 2015లో వివాహం జరిపించారు. వీరికి కూతురు ఆద్య (8), కుమారుడు జయసూర్య(6) సంతానం. కొంతకాలంగా వెంకట్రావ్‌పేటలో ఉంటున్నారు. 

రమేశ్‌ ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి వస్తున్నాడు. నెలక్రితం దుబాయ్‌ నుంచి వచ్చిన రమేశ్‌కు సునీత వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం కలిగింది. ఇదే విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో రమేశ్‌ క్షణికావేశంలో సునీత ముఖంపై బలంగా కొట్టాడు. గొంతు నులిమి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. 

విషయం తెలుసుకున్న సునీత కుటుంబసభ్యులు ఘటనాస్థలికి వెళ్లి బోరున విలపించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై కిరణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు, కోరుట్ల సీఐ సురేష్‌బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు తండ్రి మందల గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)