Breaking News

విద్యుదాఘాత మరణాలపై నివేదిక ఇవ్వండి

Published on Wed, 04/23/2025 - 08:40

సిటీ కోర్టులు: వరుసగా జరుగుతున్న విద్యుత్‌ షాక్‌ మరణాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ టీజీఎస్‌పీడీసీఎల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘మృత్యుపాశాలు’ కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యుత్‌శాఖ కారణంగా సంభవించిన మరణాలపై సమాగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను జూన్‌ 4లోపు సమర్పించాలని టీజీఎస్‌పీడీసీఎల్‌ను ఆదేశిస్తూ విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. 

శంషాబాద్‌ కొందుర్గు మండలాలలో ఇటీవల జరిగిన ఘటనలతో పాటు గత ఏడాది కాలంలో 69 మంది విద్యుదాఘాతానికి గురై మరణించడం ఆందోళన కలిగించిందని పేర్కొంది. దీనికి కారణం ప్రమాదకరమైన వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెన్సింగ్‌ సరిగా లేకపోవడం, మెయింటెనెన్స్‌ సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని కమిషన్‌ పేర్కొంది. జూన్‌ 2025 మొదటి వారంలోగా ఈ మరణాలకు సంబంధించి వివరణాత్మక నివేదికలను సమర్పించాలని సీఎండీ టీజీఎస్‌పీడీసీఎల్‌ను, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను కమిషన్‌ ఆదేశించింది.

గత ఏడాది విద్యుత్‌ షాక్‌తో వర్షాకాలంలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మరణించిన బాధిత కుటుంబాలకు సరైన పరిహారం అందకపోవడం సంబంధిత అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోకపోవడమేమిటని  ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్టికల్‌ 21 ప్రకారం.... ప్రజలకు జీవించే హక్కుతో పాటు తమ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతోందని కమిషన్‌ పేర్కొంది. ఇప్పటి వరకు సంబంధింత మరణాల్లో ఎక్కువగా కారి్మకులు ఉండడం, వారి మృతదేహాలను సబ్‌స్టేషన్ల ముందు పెట్టి ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోవడమేంటని ప్రశ్నించింది. తదుపరి విచారణలోపు నివేదిక సమరి్పంచకపోతే నేరుగా కమిషన్‌ చర్యలు తీసుకుంటుందని సంబంధిత అధికారులను హెచ్చరించింది.  

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)