Breaking News

ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు

Published on Tue, 05/14/2024 - 14:14

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లిన నగర వాసులు తిరిగి హైదరాబాద్‌ బాట పట్టారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.

చాలాచోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు కనిపించాయి. అలాగే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, బీజేఎస్‌, ఎంజీబీఎస్‌ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. హైదరాబాద్‌ శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో మెట్రో  రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.

మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో టికెట్ల కోసం పెద్ద క్యూ ఉంది

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు అదనపు ట్రిప్పులు నడిపాలని మెట్రో నిర్ణయించినట్టు తెలిసింది.
 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)