Breaking News

స్నేహితుల ఆనంద ప్రయాణం… విషాదాంతం

Published on Thu, 01/29/2026 - 08:47

మేడ్చల్ జిల్లా: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు వరంగల్‌ జాతీయ రహదారిపై అదుపుతప్పి పిల్లర్‌ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నిఖిల్‌ (23), సాయివరుణ్‌ (23), వెంకట్‌ (23), రాకేశ్, అభినవ్, యశ్వంత్‌రెడ్డి, సాత్విక్, హర్షవర్ధన్‌ బీటెక్‌ చదువుతున్నారు. వీరంతా వనపర్తి పట్టణానికి చెందిన వారే కాక ఒకే పాఠశాలలో చదువుకున్నారు.

 మౌలాలిలోని తమ స్నేహితుడు అమెరికా నుంచి వచ్చిన సందర్భంగా అతన్ని కలిసేందుకు మంగళవారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మహేంద్ర ఎక్స్‌యూవీ 700 కారులో బోడుప్పల్‌ వైపునుంచి పోచారం వెళ్తుండగా రాత్రి 2.15 నిమిషాల సమయంలో వరంగల్‌ జాతీయ రహదారిలో ముందున్న రెండు బైకులను తప్పించి సైడ్‌ తీసుకుంటున్న సమయంలో అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి ఉప్పల్‌ నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ ఫ్లైఓవర్‌ పిల్లర్‌ నంబర్‌ 97ను బలంగా ఢీకొట్టింది. 

దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో కారును నడుపుతున్న నిఖిల్‌తో పాటు సాయివరుణ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. వెంకట్, రాకేశ్‌లకు తీవ్రగాయాలు కాగా, అభినవ్, యశ్వంత్‌రెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. సాత్విక్, హర్షవర్ధన్‌ బయటపడ్డారు. మేడిపల్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)