Breaking News

ఖైరతాబాద్‌లో కిక్కిరిసిన భక్తులు

Published on Sat, 09/14/2024 - 18:44

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ బడా గణపతి నిమజ్జనం మంగళవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ గణపతి దర్శించుకునేందుకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.

కాగా, ఖైరతాబాద్‌లో బగా గణేష్‌ దర్శనం భక్తులు బారులు తీరారు. వీకెండ్‌, నవ రాత్రి ఉత్సవాలు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో గణపతిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగింది. శనివారం మధ్యాహ్నం నుంచి గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో, దర్శనానికి వచ్చే భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడుతున్నారు.  

మరోవైపు.. విగ్రహం వద్ద భక్తుల సంఖ్య పెరగడంతో కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది సెల్ ఫోన్ పోగుట్టుకున్నారని తెలుస్తోంది. బంగారం, పర్సులు, తమ విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో దొంగలు సంచరిస్తున్నారని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసులు  హెచ్చరించారు. ఇక, రేపు ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఖైరతాబాద్‌ రూట్‌లో వచ్చే మెట్రో సర్వీసులు కూడా ఫుల్‌ అయిపోయాయి. మెట్రోలో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. 

 

ఇది కూడా చదవండి: హైడ్రాపై కమిషనర్‌ రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)