Breaking News

ఈసారీ..భారీగానే..

Published on Thu, 01/30/2025 - 04:22

సాక్షి, హైదరాబాద్‌: పరిమిత ప్రాజెక్టులు.. మొత్తం కేటాయింపుల్లో వాటికే సింహభాగం నిధులు.. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల విషయంలో అనుసరిస్తున్న విధానం. ఈ ప్రయోగం ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది.

దీనివల్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో మూడు కీలక ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే దిశగా రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రానుండటంతో తెలంగాణలో రైలు సేవలు బాగా మెరుగుపడబోతున్నాయి.  

బల్లార్షా–కాజీపేట–విజయవాడ
ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే కీలక మార్గం ఇది. అందుకే దీన్ని గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌గా పిలుస్తారు. ఈ మార్గంలో నిత్యం 460 వరకు రైళ్లు పరుగు పెడుతుంటాయి. ప్రస్తుతం దాని ట్రాఫిక్‌ సాంద్రత ఏకంగా 160 శాతంగా ఉంది. ఈ మార్గంలో కనీసం మరో 250 ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్లను నడపాల్సి ఉన్నా, సాంద్రత ఎక్కువగా ఉండటంతో సాధ్యం కావటం లేదు. దీంతో మూడో లైన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

కాజీపేట– విజయవాడ మధ్య మూడో లైన్‌ 2012–13లో మంజూరు కాగా, కాజీపేట–బల్లార్షా లైన్‌ 2015–16లో మంజూరైంది. కానీ పనులు వెంటనే మొదలు కాలేదు. గత మూడేళ్లుగా వీటికి భారీగా నిధులు కేటాయిస్తుండటంతో ఇప్పుడు పనులు కొలిక్కి వచ్చాయి. ఈ మార్గంలో వంతెనల నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగతా పనులు వేగం పుంజుకున్నాయి. దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు. 

కాజీపేట–బల్లార్షా మధ్య 202 కి.మీ. నిర్మాణాన్ని రూ.2,063 కోట్ల అంచనాతో ప్రారంభించారు. రాఘవాపురం–కొలనూరు, కొలనూరు–పోత్కపల్లి, విరూరు–మాణిక్‌ఘర్, బిజిగిర్‌ షరీఫ్‌– ఉప్పల్, విరూరు–మాకుడి, పోత్కపల్లి–బిజిగిర్‌ షరీఫ్, మాకుడి–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య ఇప్పటికే పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. గత బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.300 కోట్లు కేటాయించారు. ఈసారి కొంత సవరించే అవకాశం ఉంది. 

భారీగా నిధులు ఇవ్వటంతో హసన్‌పర్తి రోడ్డు–ఉప్పల్, ఆసిఫాబాద్‌–రేచినిరోడ్, హసన్‌పర్తి–కాజీపేట పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 173.27 కి.మీ. రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తయింది. 28 కి.మీ. పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బల్లార్షా– మాణిక్‌ఘర్, రేచిని రోడ్‌–బెల్లంపల్లి– మందమర్రి, ఆసిఫాబాద్‌– సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య పూర్తి కావాల్సి ఉంది.  

కాజీపేట–విజయవాడ మూడో లైను 
ఈ లైన్‌ పూర్తి నిడివి 220 కి.మీ. గత బడ్జెట్‌లో దీనికి రూ.310 కోట్లు కేటాయించగా, తర్వాత కొన్ని నెలలకే ఆ మొత్తాన్ని రూ.500కు పెంచారు. దీంతో ఒక్కసారిగా పనుల్లో వేగం పెరిగింది. 104 కి.మీ. నిడివిలో మూడో లైన్‌ పనులు పూర్తి చేయటంతోపాటు, అన్ని వంతెనలను సిద్ధం చేశారు. మిగతా పనులు మూడొంతులు పూర్తి కాగా, తుదిదశ పనులు మాత్రమే మిగిలాయి. 

విజయవాడ–కొండపల్లి, కొండపల్లి–చెరువు మాధవరం, చెరువు మాధవరం–గంగినేని–ఎర్రుపాలెం, నెక్కొండ–చింతలపల్లి, చింతలపల్లి–వరంగల్‌ మధ్య ఇప్పటికే మూడో లైన్‌ వినియోగంలోకి రాగా, పందిళ్లపల్లి–బోనకల్, ఎర్రుపాలెం–మధిర, విజయవాడ–బెజవాడ క్యాబిన్‌ మధ్య గత ఏడాది కాలంలో పూర్తయ్యాయి. బోనకల్‌–మధిర, నెక్కొండ–పందిళ్లపల్లి మధ్య పనులు జరగాల్సి ఉంది. మరో ఏడాదిలో పనులు దాదాపు పూర్తి కానున్నాయి.  

మనోహరాబాద్‌–కొత్తపల్లి 
సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే 151 కి.మీ. కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్లుగా వేగంగా జరుగుతున్నాయి. గత బడ్జెట్‌లో దీనికి రూ.350 కోట్లు కేటాయించారు. ఇప్పటికే సికింద్రాబాద్‌–సిద్దిపేట మధ్య రైలు సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఇక సిద్దిపేట–సిరిసిల్ల మధ్య ఫార్మేషన్, కటింగ్, లింకింగ్‌ పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో రెయిల్స్‌ పరవనున్నారు. ఈ సెక్షన్‌లో దాదాపు 60 వరకు మైనర్‌ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. నాలుగు ఆర్‌ఓబీల నిర్మాణం పూర్తి కావచ్చింది. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో సిరిసిల్ల వరకు రైలు నడిపేందుకు వీలు కలగనుంది.  

మరికొన్ని మార్గాల్లో..
» సిరిసిల్ల–కరీంనగర్‌ మధ్య 40 కి.మీ. మార్గానికి భూ పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవటంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అక్కడ పనులు జరగటం లేదు. భూ పరిహారం రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూమిని రైల్వేకు అప్పగించి ఉంటే ఈపాటికి చాలా పని జరిగి ఉండేది. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.  

»  నడికుడి మీదుగా బీబీనగర్‌– గుంటూరు మార్గాన్ని రెండు వరుసలకు విస్తరించే ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో రూ.220 కోట్లు కేటాయించారు. 248 కి.మీ. ఈ మార్గంలో కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పూర్తయింది. ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. మిగతా చోట్ల భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. 

» 2023–24లో బడ్జెట్‌లో మంజూరు చేసిన ముద్ఖేడ్‌–డోన్‌ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌ పనులు ప్రారంభమయ్యాయి. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను సవరించి మధ్యలో రూ.550 కోట్లు మంజూరు చేశారు.  

» 2023–24లో మంజూరు చేసిన భద్రాచలం–డోర్నకల్, మోటమర్రి–విష్ణుపురం డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌ పనులు మొదలయ్యాయి. గత బడ్జెట్‌లో వీటికి రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.  

»  గత బడ్జెట్‌లో మంజూరు చేసిన పాండురంగాపురం–మల్కాజిగిరి కొత్త లైన్, ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)