Breaking News

SIR ఫామ్‌ ఎలా నింపాలో తెలియక తికమకపడుతున్నారా?

Published on Wed, 07/01/2026 - 19:41

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. బీఎల్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్‌ ఇస్తున్నారు. ఓటరు ఆ ఫామ్ నింపాక మళ్లీ తీసుకుంటున్నారు. బీఎల్‌వోలు ఇచ్చే ఫామ్‌లో కింది భాగంలో ఓటర్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే, పైభాగంలో రెండు కాలమ్‌లు కనపడతాయి. 

ఆ పై భాగంలోని ఎడమవైపు... 2002కు ముందే ఓటు హక్కు ఉంటే నింపాలి. ఒకవేళ 2002లో మీకు ఓటు లేకపోతే ఆ సమయంలో ఓటు హక్కు ఉన్న మీ బంధువుల వివరాలను రాయాలి. వారి పేరు, ఓటరు కార్డు నంబరు, వారితో మీకు ఉన్న బంధుత్వం, రాష్ట్రం, అసెంబ్లీ నియోజక వర్గ పేరు, ఫామ్‌లో అడిగిన మిగతా వివరాలు రాయాల్సి ఉంటుంది. పాత ఫొటో, కొత్త ఫొటో ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్‌, ఫోన్‌ నంబర్లు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి వివరాలను కూడా రాయాల్సి ఉంటుంది. 

ఫామ్‌లో ప్రధాన భాగంలో ఓటరు లేదా అతని దగ్గరి కుటుంబ సభ్యుడు (తల్లిదండ్రుల్లో ఒకరు వంటి వారు) తెలంగాణలో 2002లో జరిగిన చివరి ఎస్‌ఐఆర్‌లో ఏ ఓటరు జాబితాలో నమోదు అయ్యారో ఆ వివరాలు ఇవ్వాలి. ఆ వివరాలు గుర్తులేకపోతే ఓటర్లు వాటిని ఓటర్ల సేవల పోర్టల్‌ ద్వారా చూసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.

మీరు ముందుగానే పలు వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా తీసుకుని పెట్టుకుంటే మీ పని సులువు అవుతుంది.

వీటిని ఇలా తెలుసుకోండి

1.2025 ఓటర్‌ లిస్టులో మీ పేరును సెర్చ్‌ చేసి చూసుకోండి

  • https://ceotelangana.nic.in/ ఓపెన్‌ చేయండి

  • Search Your Name in voter list  ట్యాబ్‌ కనపడుతుంది

  • దానిపై క్లిక్‌ చేయండి

  • మీ ఓటర్‌ ఐడీ ఎపిక్‌ నంబర్‌, రాష్ట్రం పేరు, క్యాప్చాను టైప్‌ చేయండి

  • మీ ఓటర్‌ కార్డుకు సంబంధించిన వివరాలు వస్తాయి


2.డోర్‌ నంబరు ద్వారా 2002 ఓటరు జాబితాను కనుక్కోవచ్చు 

  • https://mintcream-grouse-474676.hostingersite.com/   క్లిక్‌ చేయండి

  • 2002లో ఓటరు ఉన్న జిల్లా, అసెంబ్లీ, ఇంటి నంబరును టైప్‌ చేస్తే వివరాలు వస్తాయి


3.చివరి ‘సర్‌’ జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా చూసుకోవచ్చు

  • https://voters.eci.gov.in/searchInSIR/S2UA4DPDF-JK4QWODSE ఓపెన్‌ చేయండి

  • ఈ కింది వివరాలను అన్నింటినీ ఇవ్వండి

  • క్యాప్చా టైప్‌ చేసి, సెర్చ్‌పై క్లిక్‌ చేయండి

  • మీ పేరు ఉంటే వస్తుంది

4. మీ బీఎల్‌వో ఎవరు, వారి ఫోన్‌ నంబరు ఎంత వివరాలను కూడా ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. మీకేమన్నా డౌట‍్లు ఉంటే బీఎల్‌వోకు ఫోన్‌ చేసి అడగొచ్చు

  • https://ceotserms2.telangana.gov.in/TS_ERODETAILS/BLO_Details.aspx ఓపెన్‌ చేయండి 

  • మీ జిల్లా, నియోజక వర్గ పేర్లను ఇవ్వండి

  • బీఎల్‌వోల పూర్తి వివరాలు వస్తాయి

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)