Breaking News

TG: బీసీ రిజర్వేషన్లు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Published on Sat, 09/27/2025 - 16:30

సాక్షి, హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(శనివారం, సెప్టెంబర్‌ 27) విచారణ జరిపింది. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ విచారించేందుకు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ ఏర్పాటు చేశారు. జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి, జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌లతో ఏర్పాటైన బెంచ్‌ విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మయూర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటడం.. రాజ్యాంగ విరుద్ధమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని మయూర్‌రెడ్డి వివరించారు.

ప్రభుత్వం తరపున ఏజీ వర్చువల్‌గా హాజరుకాగా.. బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో రిజర్వేషన్లు 50 శాతం మించినట్టు ఉందని హైకోర్టు ప్రస్తావించింది. బీసీ బిల్లు గవర్నర్‌ దగ్గరికి ఎప్పుడు వెళ్లిందంటూ ధర్మాసనం ప్రశ్నించగా.. గవర్నర్‌ దగ్గరకు బిల్లు వెళ్లి నెలరోజులు దాటిందని ఏజీ సమాధానమిచ్చారు. గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు?. రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఎలా ఇస్తారు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. మేం జోక్యం చేసుకోవద్దంటే.. ఎన్నికలకు వెళ్లమని హామీ ఇవ్వండి. 10 రోజుల వరకు ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టమని హామీ ఇవ్వాలన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఆలోచన ఏంటో ఏజీ చెప్పాలని పేర్కొంది.

‘‘ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పిటిషన్లు దాఖలైతే కోర్టులు జోక్యం చేసుకోలేవు. ఎన్నికల  నోటిఫికేషన్‌కు ముందే.. పిటిషన్లు ఉన్నాయి కాబట్టి విచారించొచ్చు’’ అని హైకోర్టు పేర్కొంది. విచారణ అక్టోబర్‌ 8కి వాయిదా వేసిన ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్‌ చేస్తూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్‌ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి మరోసారి రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు. మూడు రోజుల క్రితమే రిజర్వేషన్లపై ఆయన పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్‌ ఎలా వేశారంటూ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ శుక్రవారం(సెప్టెంబర్‌ 26) జీవో విడుదల చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)