Breaking News

వరద రావచ్చేమో..

Published on Sat, 11/09/2024 - 08:19

సాక్షి, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ ప్రగతినగర్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ నెల రోజుల  క్రితం అయిదంతస్తుల భవన నిర్మాణానికి అనుమతుల కోసం హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు దరఖాస్తు చేసుకుంది. నెల రోజుల పాటు దరఖాస్తు పరిశీలన దశలోనే ఉంది. వివిధ స్థాయిలకు చెందిన అధికారులు పరిశీలించి చివరకు ఆ ప్రాంతంలో వరద నీరు రావచ్చేమోననే  సందేహాన్ని చల్లగా వ్యక్తం చేశారు. ఈ సందేహాన్ని నివృత్తి చేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి టోపోమ్యాప్‌తో కూడిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కావాలంటూ  కొర్రీలు  పెట్టారు. 

నెలరోజుల పాటు ఎటూ తేల్చకుండా చివరకు ఎన్‌ఓసీలు కావాలంటూ షరతులు పెట్టడంతో సదరు నిర్మాణ సంస్థకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నిజానికి అదే ప్రాంతంలో  దశాబ్దాలుగా ఎంతో మంది నివాసం ఉంటున్నారు. దరఖాస్తు చేసుకున్న స్థలానికి చుట్టుపక్కల అపార్ట్‌మెంట్‌లు కూడా ఉన్నాయి. పైగా హెచ్‌ఎండీఏ గతంలో ఇచ్చిన దరఖాస్తులతోనే ఆ భవనాలను కట్టారు. నిర్మాణానికి అన్ని విధాలా అర్హత ఉన్న ఆ స్థలానికి కొత్తగా టోపో మ్యాప్‌తో పాటు ఎన్‌ఓసీ కావాలని ఆంక్షలు విధించారు. ఒక్క ప్రగతినగర్‌లోనే కాదు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా  బిల్డర్‌లు, మధ్యతరగతి వర్గాలు హడలెత్తుతున్నాయి. టీజీబీపాస్‌ ద్వారా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి పొందడమే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది.  

ఎండమావుల్లా ఎన్‌ఓసీలు...  
⇒ భవన నిర్మాణాలు, లే అవుట్‌లు, ఎల్‌ఆర్‌ఎస్‌లు, ఆక్యుపెన్సీ సరి్టఫికెట్‌లు వంటి వివిధ రకాల పనులపై సాధారణంగానే నెలలు గడిచినా అనుమతులు లభించడం దుర్లభంగా మారింది. కేవలం 15 రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి  అనుమతులను జారీ చేయాల్సి ఉండగా నెలలు గడిచినా అనుమతులు లభించడం లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఫైళ్లు పెండింగ్‌ జాబితాలో పేరుకుపోతున్నాయి. ఇదే సమయంలో కొత్తగా రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్‌ఎండీఏ అనుమతుల్లో  ఇరిగేషన్, రెవిన్యూ శాఖలను కూడా చేర్చారు. దీంతో ఫైళ్ల కదలికలో మరింత జాప్యం ఏర్పడుతోంది.  

⇒ ఇదంతా  ఒకవైపైతే.. మరోవైపు హెచ్‌ఎండీఏ ఆంక్షల మేరకు ఇరిగేషన్, రెవిన్యూ విభాగాల నుంచి ఎన్‌ఓసీలు  జారీ కావడం లేదు. తుర్కయంజాల్‌కు చెందిన  ఓ దరఖాస్తుదారు ఏడాది క్రితం భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దశాబ్దాల క్రితం అక్కడ పంట కాల్వ ఉన్నట్లు పరిగణించి ఎన్‌ఓసీ కోరారు. ఈ మేరకు ఆరు నెలల పాటు  ఇరిగేషన్‌ అధికారుల చుట్టూ తిరిగి ఎన్‌ఓసీ సంపాదించారాయన. కానీ.. అదొక్కటే చాలదు. రెవెన్యూ ఎన్‌ఓసీ కూడా అవసరమన్నారు. ఇప్పటి వరకు  రెవెన్యూ నుంచి  ఎన్‌ఓసీ లభించలేదు. దీంతో భవన నిర్మాణాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు  ఎన్‌ఓసీలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

రెవెన్యూ అవసరం లేకపోయినా..  
సాధారణంగా వర్షం కురిసినప్పుడు  ఎత్తు నుంచి పల్లానికి వరద నీళ్లు ప్రవహిస్తాయి. టోపో మ్యాప్‌ల ఆధారంగా ఇలాంటి వరద కాల్వలను గుర్తిస్తారు. భవన నిర్మాణం చేపట్టనున్న స్థలానికి చుట్టూ 500 మీటర్‌ల పరిధిలో ఎలాంటి వరదలు రావని  నిర్ధారిస్తూ  ఎన్‌ఓసీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నీటిపారుదల అధికారులు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు నిరాకరిస్తే అది వరద ముప్పు ఉన్న ప్రాంతంగానే పరిగణించాలి. ఇందులో రెవెన్యూ శాఖ  భాగస్వామ్యం అవసరం లేదు. వర్షపు నీరు ప్రవహించే  ప్రాంతాలుగా అనుమానించి కొర్రీలు విధిస్తున్న హెచ్‌ఎండీఏ  అధికారులు ఇరిగేషన్‌తో పాటు రెవెన్యూ ఎన్‌ఓసీలను కూడా తప్పనిసరి చేయడం గమనార్హం. కాగా.. హైడ్రా రాకతోనే  తాము ఇలాంటి ఎన్‌ఓసీలను కోరుతున్నామని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)