అమ్మకానికి హెచ్‌ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలం ఎప్పుడంటే?

Published on Mon, 02/20/2023 - 12:03

సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లోని హెచ్‌ఎండీఏ  స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అందుబాటు ధరల్లో  ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు  చేపట్టారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎమ్మెస్‌టీసీ ఈ  వేలం ప్రక్రియను నిర్వహించనుంది. మధ్యతరగతి ప్రజలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, డెవలపర్లు ఈ ల్యాండ్‌ పార్సిళ్లను కొనుగోలు చేసేందుకు అనుగుణంగా  స్థలాల విస్తీర్ణం ఉన్నట్లు  అధికారులు  తెలిపారు.

ఔటర్‌రింగ్‌ రోడ్డుకు దగ్గరలో  39 ల్యాండ్‌ పార్సిళ్లు  అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10,  మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 6 ప్లాట్‌లు,  సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్‌ పార్సిళ్లు  ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ స్థలాల వివరాలను  కేఎంఎల్‌ ఫైల్‌ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది. 121 నుంచి 10,164 గజాల వరకు ఈ స్థలాలు ఉన్నాయి. గండిపేట వద్ద 3 ప్లాట్‌లు, శేరిలింగంపల్లిలో 5, ఇబ్రహీంపట్నంలో 2 ప్లాట్‌లు, అమ్మకానికి ఉన్నాయి. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో 4, ఘట్కేసర్‌లో 1, బాచుపల్లిలో 1 చొప్పున ఉన్నట్లు  అధికారులు  పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో 16, ఆర్‌సీపురంలో 6 ప్లాట్‌లు, జిన్నారంలో ఒకటి చొప్పున స్థలాలు అమ్మకానికి  సిద్ధంగా ఉన్నాయి. 

ఆన్‌లైన్‌ వేలం..
39 స్థలాలను వచ్చే నెల మార్చి 1న ఎమ్మెస్‌టీసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్‌ టైటిల్‌ కలిగిన ఈ స్థలాలను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెస్‌టీసీలో నమోదు చేసుకోవాలి.

ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన ఈఎండీ (ధరావత్తు) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 21న  రంగారెడ్డి జిల్లా పరిధిలోని  స్థలాలకు శేరిలింగంపల్లి జోనల్‌ ఆఫీసులో,  22వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని స్థలాలకు  ఆర్‌సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో 23న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా స్థలాలపై ఉప్పల్‌ సర్కిల్‌  ఆఫీసులో ప్రీ బిడ్‌ సమావేశాలను  నిర్వహించనున్నారు.
చదవండి: ధర తక్కువ.. డిమాండ్‌ ఎక్కువ..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి!

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)