Breaking News

వడ్డీ ఆశచూపి.. నట్టేట ముంచి..

Published on Thu, 12/19/2024 - 12:05

బంజారాహిల్స్‌: వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకుని మోసం చేసిన మహిళపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్డునంబర్‌–14లోని శ్రీ వేంకటేశ్వరనగర్‌ బస్తీలో కొడాలి శ్రీలక్ష్మి అనే మహిళ 15 ఏళ్లుగా అద్దెకు ఉంటూ స్థానికంగా నమ్మకంగా ఉంటోంది. వడ్డీలు ఇస్తానంటూ పలువురి నుంచి డబ్బులు తీసుకునేది. మొదటి రెండు నెలలు వడ్డీ  సక్రమంగా ఇచ్చి ఇతరులకు ఆశ లు పెంచేది. 

దీంతో చాలామంది వడ్డీ వస్తుందనే ఆశతో డబ్బులు ఇచ్చేవారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో కొన్నేళ్లుగా టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీలక్ష్మీ ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న చాలామందిని సైతం మోసం చేసింది. తన కొడుకు ఫీజు చెల్లించాలంటూ వట్టికొండ రంగనాథ్‌ నుంచి రూ.4.75 లక్షలు అప్పుగా తీసుకుని ప్రాంసరీ నోట్‌ రాసిచి్చంది. 

అయితే ఏళ్లు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోగా భర్త సత్యప్రకాశ్‌తో కలిసి బెదిరింపులకు పాల్పడేది. వీరికి ఇంటి యజమానురాలు పద్మ కూడా వంతపాడేది. డబ్బులు ఇచి్చన వారు ఇంటికి వస్తే పద్మ వారిని బెదిరింపులకు గురిచేసేది. బస్తీతో పాటు బసవతారకం ఆస్పత్రి ఉద్యోగుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి బిచాన ఎత్తేసింది. మోసపోయామని గ్రహించిన సుమారు 50 మంది బాధితులు ఆధారాలతో సహా బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వారు శ్రీలక్ష్మీతో పాటు ఆమె భర్త సత్యప్రసాద్, ఇంటి యజమానురాలు పద్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

Photos

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)