Breaking News

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకూ చట్టాలు రావాలి

Published on Sun, 12/14/2025 - 07:51

సాక్షి, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సమయ పాలన లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారి పరిరక్షణకు చట్టాలు రావాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. వేతనాలు ఘనంగా ఉన్నా వారి వ్యక్తిగత జీవితం విరుద్ధంగా ఉంటోందని చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన ఇలాంటి రంగం గురించి పాలకులు ఆలోచించాలని సూచించింది. 

ఆ ఉద్యోగుల హక్కులు హరించే అధికారం ఎవరికీ లేదని ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. అగ్రిమెంట్‌ను పాటించకుండా రాజీనామా చేస్తున్నందుకు రూ.5.9 లక్షల పరిహారం చెల్లించాలని కంపెనీ డిమాండ్‌ చేయడంపై ఫిర్యాదు చేసినా.. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాజేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టి.. తాజాగా తీర్పు వెలువరించింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల సామాజిక భద్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 27 ప్రకారం ఒక వ్యక్తిని చట్టబద్ధమైన వృత్తి, వాణిజ్యం, వ్యాపారం చేపట్టకుండా ఆపే ఒప్పందాలు చెల్లుబాటు కావన్నారు. ఈ కేసులో కంపెనీ ఏ ప్రాతిపదికన పరిహారం నిర్ణయించిందో తేల్చాలని కార్మీకశాఖను ఆదేశించారు. పిటిషనర్‌ రాజీనామాను ఆమోదించాలంటూ కంపెనీకి తేల్చిచెప్పారు.   

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)