Breaking News

హైకోర్టు ఆదేశాలు : షకీల్‌ కుమారుడు విచారణకు సహకరించాల్సిందే

Published on Wed, 12/04/2024 - 19:35

సాక్షి,హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ఎదుట సాహిల్ హాజరు కావాలని సూచించింది.   

గతంలో, ప్రజా భవన్ గేట్లను తన కారుతో ఢీకొట్టాడంటూ సాహిల్‌పై పంజాగుట్ట పోలీసులకు కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో సాహిల్‌ దుబాయ్‌ వెళ్లాడు. అక్కడే ఉంటున్నాడు. అయితే, ఈ కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా సాహిల్‌ దుబాయ్ నుండి హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు సహకరించాలని సాహిల్‌కు ఆదేజాలు జారీ చేసింది. 

అసలేం జరిగిందంటే 
గత డిసెంబర్ నెల 23వ తేదీన వేకువజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజా భవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహనం మితిమీరిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న మిగిలినవారిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నిందితులను పంజాగుట్ట పీఎస్​కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సాహిల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పై విధంగా స్పందించింది. దీంతో, కోర్టు ఆదేశాలతో సాహిల్‌ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ రానున్నాడు.  

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు