Breaking News

మా ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు?

Published on Fri, 12/26/2025 - 04:22

సాక్షి, హైదరాబాద్‌: పిటిషనర్‌కు రూ.1.16 కోట్ల బకాయిలు చెల్లించాలని చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం వహించారో చెప్పాలని తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇద్ద రు ఐఏఎస్‌లకు హైకోర్టు ఫామ్‌–1 నోటీసులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌తోపాటు పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కనకరత్నం, కరీంనగర్‌ రీజియన్‌ ఎస్‌ఈ లచ్చయ్య, రహమాన్, నర్సింహారావులను హాజరుకావాలని ఆదేశించింది. 

జనవరి 9న ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరై వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. హాజరు నుంచి వినహాయింపు పొందేందుకు ఎలాంటి కారణాలు చెప్పవద్దని హెచ్చరించింది. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేసింది. సివిల్‌ పనులకు సంబంధించి తమకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వడం లేదంటూ కె.ఆనంద్‌ అండ్‌ కంపెనీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్‌కు చెల్లించాల్సిన రూ.1,16,51,734ను ఆరు వారాల్లో విడుదల చేయాలని గత ఏప్రిల్‌లో తీర్పునిచ్చింది. 

మూడు నెలలు గడిచినా తీర్పును అమలు చేయకపోవడంతో పిటిషనర్‌ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల ను చెల్లించాలన్న తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేద ని న్యాయమూర్తి ప్రశ్నించారు. 

గతంలో పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్, కరీంనగర్‌ జిల్లా ఎస్‌ఈ, పంచాయ తీ రాజ్‌ ఇంజనీర్, పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ హాజరై ఉత్తర్వు లను అమలు చేస్తామని చెప్పారని.. అయినా నిర్లక్ష్యం వహించడం క్షమించరానిదన్నారు. గతంలో పలుమార్లు కేసు విచార ణకు వచ్చినా ఎలాంటి సమాధానం లేకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు