Breaking News

దేవుడికీ అర్థం కారు!

Published on Tue, 06/17/2025 - 01:26

సాక్షి, హైదరాబాద్‌: దేవుడు దిగివచ్చినా మున్సిపల్‌ అధికారుల తీరును అర్థం చేసుకోవడం సాధ్యం కాదని హైకోర్టు మండిపడింది. కళ్ల ముందే అంతస్తులకు అంతస్తులు భవన నిర్మాణం జరుగుతున్నా కబోదుల్లా వ్యవహరిస్తున్నారని.. తీరా నిర్మాణం పూర్తయ్యాక విధులు గుర్తుకొచ్చి కూల్చివేత అంటూ హడావుడి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

రాష్ట్రంలో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు మున్సిపల్‌ అధికారులే బాధ్యులని చెప్పింది. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించగా.. ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. 

‘నెలల తరబడి భవన నిర్మాణమంతా పూర్తయ్యే వరకు మున్సిపల్‌ అధికారులు ఏం చేస్తుంటారు? ఆ ప్రాంతంలోని ఏరియా ఇన్‌స్పెక్టర్లు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా? సెక్షన్‌ 461 ప్రకారం నిర్మాణం ప్రారంభంలోనే సీజ్‌ చేసే అధికారమున్నా ఎందుకు చేయరు? ఎవరో పిటిషన్‌ వేస్తే.. కోర్టు ఆదేశాలు జారీ చేస్తే.. తర్వాత స్పీకింగ్‌ ఆర్డర్స్‌ ఇస్తారు. స్పీకింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చేలోపు భవన నిర్మాణం పూర్తవుతుంది. 

అప్పుడు కూల్చివేత అంటూ హడావుడి ప్రారంభిస్తారు.. రాష్ట్రంలో ఏటా వెలుస్తున్న అనధికార నిర్మాణాలను ఎందుకు ఆపలేకపోతున్నారు? విచిత్రమేంటంటే.. అక్రమ నిర్మాణం చేసేటప్పుడు వారికి కనిపించదు.. కానీ, పన్ను వసూలుకు మాత్రం ఆ భవనం కనిపిస్తుంది.. దాని వివరాలన్నీ తెలుస్తాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంటారు. 

మునిసిపల్‌అధికారులను దేవుడు కూడా బాగుచేయలేడు. ప్రజలకు మునిసిపల్‌ అధికారులు, న్యాయవాదులు, కోర్టుల గురించి తెలుసు. అధికారుల తీరు మారకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు’అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.  

క్రమబద్ధీకరణపై నిర్ణయం వరకు యథాతథస్థితి 
జీహెచ్‌ఎంసీ చట్టం–1955లోని సెక్షన్‌ 462 కింద చందానగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ నోటీసు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్‌కు చెందిన కె.రఘువీర ఆచారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భవనం కూల్చివేస్తామంటూ అధికారులు నోటీసులు జారీ చేయడం చట్టవిరుద్ధమన్నారు. భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్‌) కింద దరఖాస్తు చేసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన నోటీసులను నిలుపుదల చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

వాదనలు విన్న న్యాయమూర్తి.. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. చాలాప్రాంతాల్లో అక్రమ నిర్మాణదారులకు అధికారులు సహకరిస్తున్నారని, అందుకే నిర్మాణాలు పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. 

పిటిషనర్‌ సమర్పించిన క్రమబద్ధీకరణ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకునే వరకు యథాతథస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులను కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను జూలై 15కు వాయిదా వేశారు.    

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)