Breaking News

మంత్రి కొప్పుల ఈశ్వర్​కు హైకోర్టులో ఊరట

Published on Fri, 12/01/2023 - 13:26

సాక్షి, హైదరాబాద్​: తెలంగాణ హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్​కు ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసింది. కాగా కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై అనర్హత విధించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఎమ్మెల్యేగా ఆయనపై వేటు వేయాలని పిటిషన్లు వేశారు. ధర్మపురి ఎన్నికపై రీకౌంటింగ్ జరపాలని కోరారు.

తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కాంగ్రెస్​నేత పిటిషన్​ను కొట్టివేసింది.  ఇదిలా ఉండగా  గత ఎన్నికల్లో కరీంనగర్ జల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసి కేవలం 441 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్​పై ​గెలిచారు. దీంతో వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించకముందే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని, అధికారులు ఆయనకు మద్దతిచ్చారని లక్ష్మణ్ ఆరోపించారు. 

ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ధర్మపురి నియోజవకవర్గం నుంచి బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నుంచి మళ్లీ ఈ ఇద్దరు నేతలే తలపడుతున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఈసారి గెలుపెవరిదో తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. డిసెంబర్​ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)