Breaking News

‘పోలీస్‌’ అభ్యర్థులపై కేసు చెల్లదు

Published on Wed, 07/09/2025 - 00:35

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిరసన చేపట్టిన అభ్యర్థులపై బంజారాహిల్స్‌ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్‌ కేసు చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్ర­యించిన 10 మందికి ఊరటనిస్తూ వారిపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ) వద్ద ఆందో­ళనకు దిగినందుకు బంజారాహిల్స్‌ పోలీసులు 2023 ఫిబ్రవరి 3న 16 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన కొంగరి మహేశ్‌ సహా పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. ఐసీసీసీ భవ­నం సమీపంలో 16 మంది  చట్టవిరుద్ధంగా సమావేశమై అనుమతి లేకుండా ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని ప్రభుత్వ న్యాయ­వాది వాదనలు వినిపించారు. రోడ్డుపై నినాదాలు చేస్తూ ట్రాఫిక్‌ను అడ్డుకున్నారన్నారు. అందువల్ల దర్యాప్తును కొనసాగించేలా పిటిషన్‌ను కొట్టేయా­లని కోరారు. అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయ­వాది వాదిస్తూ పరుగు పందెం, లాంగ్‌ జంప్, షాట్‌ఫుట్‌ విభాగాల్లో అప్పటి వరకు ఉన్న కొలత­లను మార్చి, పెంచారని ఆరోపిస్తూ శాంతియుతంగా అభ్యర్థులు నిరసనకు దిగారన్నారు.

 వారు చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదని.. పోలీసులు తప్ప స్వతంత్రులెవరూ సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంటూ 10 మంది పిటిషనర్లపై కేసును రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే పిటిషనర్లకు మాత్ర­మే ఈ ఊరట లభిస్తుందని.. మిగతా వారిపై దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)