Breaking News

నేరెళ్ల ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారు?

Published on Fri, 01/03/2025 - 04:11

సాక్షి, హైదరాబాద్‌: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 2017లో దళితులపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులపై నమోదు చేసిన కేసు పురోగతి వివరాలను నెల రోజుల్లోగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బాధితులకు పరిహారం ఇచ్చారా? పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారా? లాంటి వివరాలను అందులో పొందుపరచాలని స్పష్టం చేసింది. 

తొలుత విచారణకు హాజరైన ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు వివరాలు తెలియకుండా, గడువు కోరడం కోసం ఎందుకు హాజరయ్యారంటూ మందలించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
 
ఇదీ కేసు నేపథ్యం.. 
చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు, టిప్పర్లు నడిచేవి. ఇసుకను తరలించే క్రమంలో జరిగిన 42 ప్రమాదాల్లో మొత్తం నలుగురు చనిపోయారు. ముఖ్యంగా 2017 జూలై 2న నేరెళ్లకు చెందిన ఎరుకల భూమయ్య అనే వ్యక్తిని ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఐదు ఇసుక లారీలను తగలబెట్టారు. దీంతో పోలీసులకు, స్థానికుల మధ్య ఉద్రిక్తత నెలకొనగా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

రెండు రోజుల తర్వాత రాత్రి 11:30 గంటలకు నేరెళ్లకు చెందిన పెంట బానయ్య, కోలా హరీశ్, చెప్పాల బాలరాజు, పసుల ఈశ్వర్‌ కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన భక్తుల మహేశ్, జిల్లెళకు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్‌లను పోలీసులు అనుమానితులుగా అదుపులోకి తీసుకొని జూలై 7న అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు.

బాధితులకు పరిహారం ఇచ్చారా? 
ఈ ఘటనలో దళితులు, బీసీ యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని.. బాధ్యులైన ఎస్పీ విశ్వనాథ్, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు పిల్‌లు దాఖలయ్యాయి. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 

అక్రమాలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకున్నారా? ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారా? చార్జిషీట్‌ దాఖలు చేశారా? బాధితులకు పరిహారం ఇచ్చారా? అని అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఏజీపీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహంవ్యక్తం చేసింది. అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడం కోసమే హాజరుకావడాన్ని తప్పుబట్టింది. దీంతో వెంటనే ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ విచారణకు హాజరయ్యారు. 

పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని కోర్టుకు తెలిపారు. విచారణ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించగా పూర్తి వివరాలతో స్థాయీ నివేదిక దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 20కి వాయిదా వేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)