Breaking News

మీ వాదనలనూ వింటాం

Published on Thu, 12/28/2023 - 04:32

సాక్షి, హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసుల వాదనలనూ వింటామంటూ.. వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. తుది విచారణలో భాగంగా అందరి వాదనలు వింటామంది. నిందితులు జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులు, మహమ్మద్‌ ఆరీఫ్‌ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లలో తమను కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని, తమ వాదనలు వినాలని కోరుతూ పోలీసులు, దిశ తండ్రితోపాటు మరికొందరు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పోలీసులపై ఐపీసీ సెక్షన్‌ 302కు బదులు 307 కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. పోలీసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై సిట్‌ నివేదిక ఇచ్చిందన్నారు. మళ్లీ ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని, అది వారి వృత్తితోపాటు వ్యక్తిగత జీవితంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు.

వాదనలు విన్న ధర్మాసనం.. ‘ఒకసారి దర్యాప్తు పూర్తయి నివేదిక సమర్పించాక మళ్లీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమనే పరిధి, అధికారం మేజి్రస్టేట్‌కు ఉండదు. అయితే సీఆర్‌పీసీ సెక్షన్‌ 482, రాజ్యాంగంలోని అర్టికల్‌ 226 కింద విచక్షణాధికారం మేరకు కేసును కొట్టివేయడానికి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే పరిధి ఈ కోర్టుకు ఉంటుంది. పిటిషనర్లు సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. నిబంధనల మేరకు కోర్టు ముందుకొచ్చి న పిటిషన్‌ను వినాలి. అలాగే పారదర్శక విచారణ కోసం పోలీసుల వాదనలనూ వింటాం’అని చెప్పింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)